
కొనుగోలు కేంద్రాలను సందర్శించిన కలెక్టర్
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మండలంలో ని నర్సింగాపూర్, నంనూర్, గుడిపేటలో ఏ ర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ కుమార్‌దీపక్, నంనూర్, దొనబండ, హాజీపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్ ఆదివారం వేర్వేరుగా సందర్శించారు. శనివా రం రాత్రి గాలి దుమారంతోపాటు కురిసిన వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు తలెత్తాయా అని తెలుసుకున్నారు. కేంద్రాల్లోని ధాన్యం తూకం, టాబ్‌లో నమోదు, ధాన్యం తరలింపు, మిల్లుల్లో అన్‌లోడింగ్ తదితర వివరాలు తెలుసుకున్నారు. సన్న, దొడ్డు రకం వరి ధాన్యంను నిబంధనల మేరకు కొనుగోలు చేయాలని సూచించారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలని తెలిపారు. ప్యాడీ క్లీనర్లు, హస్క్ రీమూవర్లు, తేమ మీటర్లు, గన్నీ సంచులు, టార్పాలిన్‌లు అందుబాటులో ఉన్నాయని రైతులు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.