విద్యారంగంలో ఎన్జీవోల జోక్యం ఆందోళనకరం
మంచిర్యాలఅర్బన్: విద్యారంగంలో ఎన్జీవోల పాత్ర గణనీయంగా పెరగటం ఆందోళన కలిగిస్తుందని, పరోక్షంగా ప్రైవేటీకరణకు దారులు వేసే ప్ర మాదం పొంచి ఉందని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కా ర్యదర్శి మల్లారెడ్డి అన్నారు. ఆదివారం మంచిర్యాలలో టీఎస్‌యూటీఎఫ్ జిల్లా విస్తృతస్థాయి కమిటీ స మావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించి నాణ్యమైన విద్యనందించకుండా ఫిజిక్స్‌వాల, ఖాన్ అకాడమీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవటమేంటని ప్రశ్నించారు. జాతీయ స్థాయిలో ఉపాధ్యాయ సంఘాలు ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ 28, 29 తేదీల్లో జనగామలో నిర్వహించే రాష్ట్ర విద్యాసదస్సుకు సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు చక్రపాణి, ప్రధాన కార్యదర్శి రాజావేణు, ఉపాధ్యక్షులు కిరణ్‌కుమార్, కార్యదర్శులు నర్సయ్య, చంద్రమౌళి, సంపత్, జైపాల్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.


