జాతీయ యోగా, కరాటే పోటీలు
మందమర్రిరూరల్: పట్టణంలోని జాతీయ రహదారి టోల్‌గేట్ సమీపంలోని త్రినేత్ర ఫంక్షన్ హాల్‌లో ఇండియన్ యోగా స్కూల్, ప్రొఫెషనల్ యోగా అసోసియేషన్ (మంచిర్యాల) వారి ఆధ్వర్వంలో ఆదివారం జాతీయ యోగా, కరాటే పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి యోగాభ్యాసకులతో పాటు కరాటే క్రీడాకారులు సుమారు 900 మంది పాల్గొని వారి ప్రతిభ చాటుకున్నారు. నిర్వాహకులు వెంకటేశ్, కమిటీ చైర్మన్ కొంపెల్లి రమేశ్ మాట్లాడుతూ ప్రతి రోజు గంట సమయం యోగా కోసం కేటాయిస్తే ఆరోగ్యం బాగుంటుందని, ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన వారికి మెడల్స్‌తో పాటు ప్రశంసాపత్రాలు అందించారు. పోటీలకు జడ్జిగా రేవెల్లి రాజలింగు వ్యవహరించగా నిర్వాహకులు రమేశ్, ప్రశాంత్‌గౌడ్, సుమంత్, వినోద్‌గౌడ్, గీతాదేవి, ఉమామహేశ్, రాజశేఖర్, రమేశ్‌రాజా, సీనియర్ యోగా మాస్టర్స్, కరాటే మాస్టర్లు పాల్గొన్నారు.


