రాష్ట్రస్థాయి పోటీల్లో ఎకై ్సజ్ అధికారుల ప్రతిభ
ఆదిలాబాద్‌టౌన్: రాష్ట్రస్థాయి పోటీల్లో ఎకై ్సజ్ అధికారులు ప్రతిభ కనబర్చారు. శని, ఆదివారాల్లో హైదరాబాద్‌లోని రైల్వే నిలయం ఇండోర్ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర ప్రొహిబిషన్ ఎకై ్సజ్, గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఆసిఫాబాద్ డీపీఈవో జ్యోతికిరణ్ బాడ్మింటన్‌లో ప్రథమ బహుమతి సాధించగా, చెస్, క్యారమ్ పోటీల్లో ఇచ్చోడ సీఐ జుల్ఫేఖార్ అహ్మద్ రాష్ట్రస్థాయి ప్రథమ బహుమతి సాధించారు. వీరిని ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ కె.రఘురాం అభినందించారు. వీరు బహుమతులు అందుకోవడంపై ఆదిలాబాద్ ఎకై ్సజ్ సీఐ విజేందర్ శుభాకాంక్షలు తెలిపారు.


