వేసవి సెలవులు వచ్చేశాయ్..
మంచిర్యాలఅర్బన్: ఏడాది పొడవునా పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు ఇంటిబాట పట్టారు. ప్రభుత్వం పాఠశాలలకు ఈ నెల 24
నుంచి సమ్మర్ హాలీడేస్ (వేసవి సెలవులు) ప్రకటించడంతో చివరి రోజు బుధవారం విద్యార్థులు, వారి కుటుంబసభ్యులతో పాఠశాలలు, కేజీబీవీలు, గురుకులాలు, సంక్షేమ వసతిగృహాలు సందడిగా మారాయి. చాలారోజుల తర్వాత ఇంటికి వెళ్తుండడంతో విద్యార్థుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కబుర్లు చెప్పుకుంటూ సెల్ఫీ దిగారు. సెలవులతో విద్యార్థులు ఇంటిబాట పట్టడంతో మంచిర్యాల బస్‌స్టేషన్ రద్దీగా మారింది. బస్సుల్లో సీట్ల కోసం పాట్లు పడ్డారు.
వేసవి సెలవులు వచ్చేశాయ్..


