
షార్ట్‌సర్క్యూట్‌తో మూడిళ్లు దగ్ధం
సిరికొండ: మండలంలోని ఫకీర్‌నాయక్ తాండలో మంగళవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మూడిళ్లు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన రాథోడ్ లాల్‌సింగ్ ఇంటిపైనున్న విద్యుత్ తీగలతో షార్ట్‌సర్క్యూట్ జరిగి పశుగ్రాసానికి నిప్పంటుకుంది. ఇంట్లో ఉన్న 10 క్వింటాళ్ల జొన్నలు, బియ్యం, బట్టలు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. రాథోడ్‌రెడ్డి, రాథోడ్ జ్ఞానేశ్వర్ ఇళ్లు పాక్షికంగా కాలిపోయాయి. తహసీల్దార్ తుకారాం, ఎస్సై శివరాం, రెవెన్యూ సిబ్బంది సంఘటన స్థలాన్ని పరిశీలించారు. రాథోడ్ లాల్‌సింగ్‌కు రూ.1.17 లక్షల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు.