
నస్పూర్‌లోని ఓ ఇంట్లో చోరీ
నస్పూర్: పట్టణ పరిధిలోని ఓ ఇంటిలో చోరీ జరి గినట్లు మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల అశోక్ తెలి పారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. కాకతీయ హిల్స్‌లో నివాసముండే భూపెల్లి లావణ్య ఈ నెల 18వ తేదీన ఇంటికి తాళం వేసి కుటుంబ స భ్యులతో కలిసి గోదావరిఖనికి పెళ్లికి వెళ్లింది. ఈనె ల 21న తిరిగి రాగా ఇంటి తాళం పగులగొట్టి ఉంది. లోనికి వెళ్లి చూసి 14 తులాల బంగారు ఆభరణాలు, రూ.5వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనాస్థలికి చేరుకుని ఇల్లు, పరిసరాలు పరిశీలించి వివరాలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మూడు ప్రత్యేక బృందా లతో గాలింపు చర్యలు చేపట్టినట్లు సీఐ తెలిపారు.