ఉట్నూర్‌రూరల్: ఉద్యాన నర్సరీ రైతులకు వరం లాంటిదని జిల్లా ఉద్యాన అధికారి, పట్టు పరిశ్రమల శాఖ జిల్లా అధికారి సుధాకర్ అన్నా రు. బుధవారం ఉట్నూర్ ఉద్యాన నర్సరీని ఆ యన సందర్శించారు. నర్సరీలో చేపడుతున్న వివిధ రకాల పనుల గురించి ఐటీడీఏ ప్రాజెక్టు ఉద్యాన అధికారి సందీప్‌కుమార్ వివరించారు. నర్సరీలో ఉన్న మామిడి, నిమ్మ, జామ, పుచ్చతోటలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన నీటికుంటలు, చెరువులను సైతం పరి శీ లించారు. కార్యక్రమంలో ఉద్యాన అధికారి క్రా ంతికుమార్, నర్సరీ సాంకేతిక అధికారి అర్షిత, సీపీఎఫ్ ఎన్జీవో ప్రతినిధులు పాల్గొన్నారు.
సీఐఎస్‌ఎఫ్ రైసింగ్ డే
జైపూర్: సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ సీఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం రైసింగ్‌డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్టీపీపీ సీఐఎస్‌ఎఫ్ టౌన్‌షిప్ నుంచి జైపూర్ మీదుగా పెగడపల్లి వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. దేశ ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో సీఐఎస్‌ఎఫ్ పాత్ర, సీఐఎస్‌ఎఫ్ సహకారాన్ని గ్రామస్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సీఐఎస్‌ఎఫ్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
ఉద్యాన నర్సరీ రైతులకు వరంలాంటిది