
స్ట్రాంగ్ రూంల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు
● జిల్లా ఎన్నికల అధికారి సంతోష్
బస్సుల ఆదాయం ఇలా..
లహరి ఏసీ బస్సులు : 4
నెల కిలోమీటరు ఆదాయం ఈపీకే ఓఆర్
ఫిబ్రవరి 61,686 35,56342 57.65 51
మార్చి 64,428 రూ.35,39,584 54.94 49
ఏప్రిల్ 61452 రూ.43,00,782 69.99 62
మే(18వరకు) 36,438 రూ.25,20,906 69.18 62
నాన్ ఏసీ : 4
ఫిబ్రవరి 64281 రూ.35,89,978 55.88 65
మార్చి 70,430 రూ.35,63,214 50.59 59
ఏప్రిల్ 65,578 రూ.33,38,136 50.90 56
మే(18వరకు) 40627 రూ.19,62,272 48.30 56
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం ముల్కల్ల గ్రామ శివారులోని ఐజా కళాశాలలో ఏర్పాటు చేసిన లెక్కింపు కేంద్రం పరిసరాలతోపాటు స్ట్రాంగ్ రూముల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సంతోష్ అన్నారు. బుధవారం లెక్కింపు కేంద్రం పరిసరాలు, భద్రత ఏర్పాట్లు, స్ట్రాంగ్ రూముల వద్ద భద్రత, కంట్రోల్ రూంలో సీసీ కెమెరాల తీరును పర్యవేక్షించి లెక్కింపు కేంద్రం పరిసరాలను బైనాక్యులర్‌తో ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్‌లతోపాటు పోస్టల్ బ్యాలెట్ పేపర్లు, మాక్ పోల్ ధ్రువప్రతాలు, పీఓ డైరీ, టెండర్ బ్యాలెట్ పేపర్లు తదితర ఎన్నికల సామగ్రిని స్ట్రాంగ్ రూముల్లో భద్రపర్చగా వాటి రక్షణకు నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తంనాయక్ పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి
చెన్నూర్‌రూరల్: వరిధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సంతోష్ అన్నారు. మండలంలోని ఎర్రగుంటపల్లి, ఒతుకులపల్లి గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆర్డీవో రాములుతో కలిసి పరిశీలించారు. రైతుల వద్ద ధాన్యం కొన్న తర్వాత వారి వివరాలను ట్యాబ్‌లలో నమోదు చేయాలని సూచించారు. ధాన్యాన్ని రైస్‌మిల్లులకు పంపేలా నిర్వాహకులు చూడాలని తెలిపారు. డిప్యూటీ తహసీల్దార్ సనత్‌కుమార్, ఆర్‌ఐ రంజిత్‌కుమార్ పాల్గొన్నారు.
విద్యార్థులకు అభినందన
మంచిర్యాలఅగ్రికల్చర్: గోవాలో ఈ నెల 19న ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో ప్రతిభ కనబర్చిన జిల్లా కేంద్రంలోని జెన్ శిటోరియ కరాటే స్కూల్ విద్యార్థులను కలెక్టర్ బి.సంతోష్ అభినందించారు. కలెక్టర్ చాంబర్‌లో మాట్లాడుతూ విద్యార్థులు బహుమతులు సాధించడం గర్వకారణమని అన్నారు. విద్యార్థులు కే.నిహారిక, కే.శ్రీదేవి, జోష్మిత, అనందన బంగారు పతకాలు, ఏ.గౌతమ్, బి.సాయి, రోహన్, మనీష్, వెండి పతకాలు సాధించారని మాస్టర్ పోచంపల్లి వెంకటేష్ తెలిపారు.

స్ట్రాంగ్ రూంల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు