భక్తిశ్రద్ధలతో ఈస్టర్‌ వేడుకలు | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో ఈస్టర్‌ వేడుకలు

Apr 6 2026 8:24 AM | Updated on Apr 6 2026 8:24 AM

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: జిల్లాలో క్రిస్టియన్‌ సోదరులు ఆదివారం ఈస్టర్‌ పర్వదిన వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. క్రీస్తు మహిమలను పాటల ద్వారా కొనియాడారు. జిల్లాకేంద్రంలోని కల్వరికొండపై నిర్వహించిన ఈస్టర్‌ వేడుకలకు శంషాబాద్‌ బైబిల్‌ కళాశాల ప్రొఫెసర్‌ ఆర్‌.ఎజ్రా ముఖ్య ప్రసంగీకుడిగా హాజరై విశ్వమానవ కల్యాణాన్ని కాంక్షిస్తూ ప్రార్థనలు చేశారు. ఈస్టర్‌ పండుగ ప్రాముఖ్యతను వివరించారు. కల్వరికొండపై జరిగిన ఈస్టర్‌ వేడుకల్లో ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఏసు పునరుత్థానం మన జీవితాలకు ఆశ, విశ్వాసం, నూతన ఆరంభాలకు మార్గదర్శకం అన్నారు. కార్యక్రమంలో ముడా చైర్మన్‌ లక్ష్మణ్‌యాదవ్‌, మేయర్‌ మమత, ఎంబీసీ చర్చి చైర్మన్‌, సీనియర్‌ పాస్టర్‌ రెవరెండ్‌ ఎస్‌.వరప్రసాద్‌, వైస్‌ చైర్మన్‌ బీఐ.జేకబ్‌, కార్యదర్శి జేఐ.డేవిడ్‌, సహాయ కార్యదర్శి ఇమ్మాన్యుయెల్‌ రాజ్‌, కోశాధికారి టీఏ.స్టీవెన్‌, సహ కోశాధికారి ఎ.టైటస్‌రాజేందర్‌, నాయకులు వినోద్‌కుమార్‌, సీజే బెనహర్‌, సిరాజ్‌ఖాద్రీ, కార్పొరేటర్‌ శ్రీపూజిత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement