మార్కెట్లకు కాసుల పంట | - | Sakshi
Sakshi News home page

మార్కెట్లకు కాసుల పంట

Apr 6 2026 8:24 AM | Updated on Apr 6 2026 8:24 AM

సెలక్షన్‌ గ్రేడ్‌ ఎంపికకు కసరత్తు:

రూ.7.03 కోట్ల ఆదాయం

అధికంగా ధాన్యం, మొక్కజొన్న

జడ్చర్ల: జిల్లాలో గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వ్యవసాయ మార్కెట్‌ యార్డుల ఆదాయానికి పంట పండింది. వ్యవసాయ పంట దిగుబడులు ఆశాజనకంగా ఉండడంతో పాటు పంటలకు గిట్టుబాటు ధరలు లభించడంతో మార్కెట్లకు ఆదాయం కలిసి వచ్చింది. ప్రధానంగా బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు ఈ ఏడాది కూడా రికార్డు స్థాయిలో 2025– 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.7.03 కోట్ల ఆదాయం వరుసగా కొన్నేళ్లుగా మార్కెటింగ్‌ శాఖ బాదేపల్లి మార్కెట్‌కు కేటాయించిన లక్ష్యాన్ని అధిగమించి ఆదాయం ఆర్జించడంపై మార్కెట్‌ అధికారులు పాలకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని మహబూబ్‌నగర్‌, దేవరకద్ర, బాలానగర్‌ మార్కెట్‌ యార్డులు కూడా నిర్దేశించిన లక్ష్మాన్ని అధిగమించాయి. నవాబ్‌పేట మార్కెట్‌ యార్డు మాత్రం నిర్దేశించిన లక్ష్యానికి కాస్త దూరంగా 70 శాతం మాత్రమే ఆదాయాన్ని సాధించింది.

బాదేపల్లిలో రూ.700 కోట్ల వ్యాపారం:

జిల్లాలోనే ఎక్కువగా ఈ ఏడాది బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఈ ఏడాది పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలకు సంబంధించి దాదాపుగా రూ. 700 కోట్ల పైచిలుకు వ్యాపారం సాగింది. ఇందుకు సంబంధించి ఒక శాతం అంటే రూ.7.03 కోట్ల ఆదాయం లభించింది. మార్కెట్‌ యార్డులో పత్తి, వేరుశనగ, మొక్కజొన్న, ఆముదాలు, వరి, తదితర పంట ఉత్పత్తుల విక్రయాలు భారీగా కొనసాగడంతో యార్డుకు అధిక ఆదాయం దక్కింది.

సెలక్షన్‌ గ్రేడ్‌ దక్కేనా?

బాదేపల్లి యార్డుకు సంబంధించి ప్రతి సంవత్సరం మార్కెట్‌ ఆదాయం పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం బాదేపల్లి మార్కెట్‌ యార్డు స్పెషల్‌ గ్రేడ్‌ మార్కెట్‌గా కొనసాగుతుంది. రూ: 4 కోట్ల ఆదాయం దాటితే యార్డును సెలెక్షన్‌ గ్రేడ్‌ మార్కెట్‌గా గుర్తించాల్సి ఉంది. గత ఐదేళ్లుగా సెలెక్షన్‌ గ్రేడ్‌ లక్ష్మాన్ని సాధిస్తూ వస్తుంది. ఈ ఏడాది కూడా ఇందుకు అనుగుణంగా ఆదాయం లభించింది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి బాదేపల్లి మార్కెట్‌ యార్డును సెలెక్షన్‌ గ్రేడ్‌గా గుర్తించాలని ప్రజలు కోరుతున్నారు.

వసతులు కరువు:

మార్కెట్‌ యార్డులకు అత్యధికంగా ఆదాయం సమకూరుతున్నా.. రైతులకు మాత్రం సరిపడా సౌకర్యా లు కల్పించడంలో అటు అధికారులు ఇటు పాలకులు విఫలమవుతున్నారు. యార్డుల్లో పూర్తిస్థాయిలో సిబ్బంది లేకపోవడంతో పర్యవేక్షణ గాడి తప్పింది. సకాలంలో అటు రైతులకు ఇటు వ్యాపారులకు సేవలు అందడం లేదు. ఇప్పటికై నా మార్కెటింగ్‌ శాఖ ఉన్నతాధికారులు స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

నవాబ్‌పేటలో తగ్గిన ఆదాయం:

నవాబ్‌పేట మార్కెట్‌కు సంబందించి నిర్దేశించిన ల క్ష్మాన్ని సాధించలేక పోయింది.ఇక్కడ రూ.117.40 లక్షల ఆదాయ లక్ష్యాన్ని నిర్దేశించగా కేవలం రూ. 83.36 లక్షలు మాత్రమే ఆదాయం లభించింది.

2025– 26 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని మార్కెట్‌ యార్డులకు సంబంధిత శాఖ నిర్దేశించిన లక్ష్యం.. సాధించిన ఆదాయం వివరాలు:

యార్డు లక్ష్యం ఆదాయం

(రూ.లక్షల్లో) (రూ.లక్షల్లో)

బాదేపల్లి 684.50 702.99

మహబూబ్‌నగర్‌ 478.70 483.51

దేవరకద్ర 156.50 169.47

నవాబ్‌పేట 117.40 83.36

బాలానగర్‌ 41.60 74.79

రికార్డు స్థాయిలో ఆదాయం

ముగిసిన 2025– 26 ఆర్థిక సంవత్సరం

జోరుగా సాగిన క్రయవిక్రయాలు

జిల్లాలోనే బాదేపల్లి యార్డుకు

అధిక ఆదాయం

బాదేపల్లి యార్డుకు సెలక్ష న్‌ గ్రేడ్‌ హోదా లభించే వి ధంగా కసరత్తు చేస్తున్నాం.ఇప్పటికే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఈ ఏడాది పంట దిగుబడులకు సంబంధించి మార్కెట్‌లో మంచి ధరలు రావడం ఆదాయానికి కలిసి వచ్చింది. మున్ముందు రైతులకు మంచి ధరలు లభించే విదంగా కృషి చేసి అ ధిక ఆదాయాన్ని ఆర్జించేందుకు కృషి చేస్తాం.

– అశ్వక్‌ అహ్మద్‌,యార్డు కార్యదర్శి,బాదేపల్లి

బాదేపల్లి యార్డుకు ప్రతి ఏడాది మంచి ఆదాయం లభిస్తుంది. ఈ ఏడాది రూ.7.03 కోట్ల ఆదాయం వచ్చింది. యార్డులో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం. ఆదాయానికి అనుగుణంగా మార్కెట్‌ స్థాయిని పెంచేందుకు కృషి చేస్తాం.

– తంగెళ్ల జ్యోతి,

మార్కెట్‌ యార్డు చైర్‌పర్సన్‌, బాదేపల్లి

ఈ ఏడాది అత్యధికంగా మార్కెట్‌లో ధాన్యం, మొక్కజొన్న, వేరుశనగ, పత్తి క్రయ విక్రయాలు కొనసాగడం మార్కెట్‌ ఆదాయానికి కలిసి వచ్చింది. దాదాపు 7 లక్షల క్వింటాళ్లకు పైగా ధాన్యం క్రయవిక్రయాలు సాగాయి. అదే విధంగా 9 లక్షల క్వింటాళ్ల మొక్కజొన్న, లక్ష క్వింటాళ్ల పత్తి, 2 లక్షల క్వింటాళ్ల వేరుశనగ, కందులు, ఆముదాలు, జొన్నలు, పొద్దుతిరుగుడు, మినుములు, పెబ్బర్లు, రాగులు, ఉలువలు, పెసర్లు తదితర క్రయవిక్రయాలు జోరుగా సాగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement