ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం మానుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం మానుకోవాలి

Apr 5 2026 8:54 AM | Updated on Apr 5 2026 8:54 AM

ఇరిగేషన్‌ మంత్రిగా ఉండి డీపీఆర్‌సమర్పించలేదు: ఎమ్మెల్యే జీఎమ్మార్‌

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: హరీశ్‌రావు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై చేస్తున్న తప్పుడు ప్రచారం మానుకోవాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి హితవు పలికారు. జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో శనివా రం డీసీసీ అధ్యక్షుడు సంజీవ్‌ ముదిరాజ్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొడంగల్‌కు విహారయాత్రకు వచ్చిన హరీశ్‌రావు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారని ఎద్దేవా చేశా రు. ఆరు గ్యారంటీలపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. పదేళ్లు మీరు అధికాంలో ఉండి చేసిన మోసాలు, దోపిడీలు యావత్‌ రాష్ట్ర ప్రజానీకానికి తెలుసన్నారు. ప్రజలకు ఇచ్చిన మా ట ప్రకారం ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ, రూ.500కే సిలిండర్‌, 200యూనిట్ల ఉచిత విద్యుత్‌, రేషన్‌ కార్డులు ఇచ్చినట్లు గుర్తు చేశారు. దేశచరిత్రలో ఎక్కడా లేని విధంగా 25 లక్షల మంది రైతులకు ఏకకాలంలో రూ.22 వేల కోట్లతో రూ.2 లక్షల రుణమాఫీ చేసినట్లు తెలిపారు. మీలా ఇంటికో ఉద్యోగం, దళిత సీఎం, కేజీ టు పీజీ ఉచిత విద్య, డబుల్‌ బెడ్‌రూం పేరిట ప్రజలను మోసం చేయలేదన్నారు. కొడంగల్‌ వరకు కాదు, మీరు దేవరకద్ర నియోజకవర్గానికి వస్తే రుణ మాఫీ రైతులు, గ్యారంటీలు అందుకుంటున్న లబ్ధిదారులను చూపిస్తామని సవాల్‌ విసిరారు. గ్రామసభల్లో ప్రజలు అడ్డుకున్నారని తప్పుడు ప్రచారం చేస్తుండడం సరికాదన్నారు. ఇరిగేషన్‌ మంత్రిగా ఉండి పాలమూరు ప్రాజెక్టు డీపీఆర్‌ ఎందుకు సమర్పించలేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ఒక్క పాలమూరు–రంగారెడ్డినే కాదు ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు సంజీవ్‌ ముదిరాజ్‌ మాట్లాడుతూ ఉనికి కోసమే హరీశ్‌రావు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఫొటోషూట్‌ కోసం పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించినట్లు నటించి ప్రజలను మోసం చేశా రని విమర్శించారు. త్వరలో పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేసి ఆ నీళ్లతో రైతుల పాదాలు తడుపుతామని అన్నారు. ముడా చైర్మన్‌ లక్ష్మణ్‌యాదవ్‌, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ బెక్కరి అనిత, నాయకులు చంద్రకుమార్‌గౌడ్‌, సీజే బెనహర్‌, రాములుయాదవ్‌, అజ్మత్‌అలీ, అవేజ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement