మా పాపకు 2025, ఆగస్టు 20న తీవ్రమైన శ్వాస సమస్యతో బాధపడుతుండటంతో నారాయణపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేయించాం. వైద్యుల సూచన మేరకు 108 వాహనంలో మహబూబ్‌నగర్ ఆస్పత్రికి ప్రథమ చికిత్స అందిస్తూ సకాలంలో తీసుకురావడంతో మా పాప బతికి బయటపడింది. సకాలంలో స్పందించిన 108 సిబ్బందికి, సంస్థకు కృతజ్ఞతలు.
– గోవిందు, ముస్తాపేట, దామరగిద్ద
15 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నా
15 ఏళ్లుగా 108 వాహనం నడుపుతున్నా. ఈ ప్రాంతంలో రాత్రిళ్లు చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి. నిరంతరం విధులు నిర్వర్తిస్తూ అత్యవసర సమయంలో ఎంతో మందికి సేవలందిస్తూ వారి విలువైన ప్రాణాలు కాపాడుతున్నాం.
– సి.శ్రీనివాస్, పైలట్, నారాయణపేట
ఎందరో ప్రాణాలు కాపాడా..
108 వాహనంలో టెక్నీషియన్‌గా 15 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నా. రోడ్డు ప్రమాద బాధితుల్ని సకాలంలో ఆస్పత్రులకు తరలించి వారి విలువైన ప్రాణాలు కాపాడా. క్షతగాత్రులను వాహనం వరకు మోసుకొచ్చి ప్రథమ చికిత్స అందిస్తూ దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించిన ఘటనలు చాలానే ఉన్నాయి.
– పి.రాజ్‌కుమార్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, నారాయణపేట
సద్వినియోగం చేసుకోండి..
108 నంబర్‌కు ఫోన్‌చేసిన 15 నిమిషాల్లో ఘటనా స్థలానికి వాహనం చేరుకొని బాధితులను దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నాం.అత్యవసర పరిస్థితిలో ప్రతి ఒక్కరూ 108 వాహన సేవలను వినియోగించుకోవాలని కోరుతున్నాం. – రవి, ఉమ్మడి జిల్లా
ప్రోగ్రామ్ మేనేజర్ , మహబూబ్‌నగర్
●


