ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతాం | - | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతాం

Dec 19 2025 9:44 AM | Updated on Dec 19 2025 9:44 AM

ప్రజా

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతాం

డీసీసీ అధ్యక్షుడు సంజీవ్‌ ముదిరాజ్‌

పాలమూరులో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిరసన

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతామని డీసీసీ అధ్యక్షుడు సంజీవ్‌ ముదిరాజ్‌ అన్నారు. జిల్లాకేంద్రంలో గురువారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. తెలంగాణ చౌరస్తా నుంచి బీజేపీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. ప్రతిపక్షాలను భయబ్రాంతులకు గురి చేయడానికి ఈడీ, సీబీఐలను ఇష్టానుసారంగా వాడుకుంటున్నదని విమర్శించారు. దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గట్టిగా ప్రస్తావిస్తున్న కాంగ్రెస్‌ అగ్రనాయకుడు రాహుల్‌గాంధీపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. నేషనల్‌ హెరాల్డ్‌ అనేది కేవలం జర్నలిజంకు సంబంధించినదని అన్నారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ పట్ల బీజేపీ అవలంభిబిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని అన్నారు. నిరసనలో ముడా చైర్మన్‌ లక్ష్మణ్‌యాదవ్‌, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ బెక్కరి అనిత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మల్లు నర్సింహారెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ఆనంద్‌కుమార్‌గౌడ్‌, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్‌రెడ్డి, నాయకులు వినోద్‌కుమార్‌, సీజే బెనహర్‌, అజ్మత్‌ అలీ, బెక్కరి మధుసూదన్‌రెడ్డి, ఫయాజ్‌, అవేజ్‌, రాములుయాదవ్‌, నాగరాజు, ప్రవీణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతాం 1
1/1

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement