ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు
● ఎన్నికల కోడ్ కఠిన ంగా అమలు చేశాం : ఎస్పీ జానకి
పాలమూరు: స్థానికసంస్థల ఎన్నికల్లో భాగంగా జిల్లా లో మూడు విడతలుగా నిర్వహించిన గ్రామపంచాయ తీ సర్పంచ్ ఎన్నికలు ఎలాంటి చిన్న అవాంచానీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా పూర్తయినట్లు ఎస్పీ జానకి తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా చేపట్టిన తనిఖీలు, నిఘా చర్యల్లో రూ.11,08,250 నగదును సీజ్ చేశామని చెప్పారు. అలాగే రూ.6,93,858 విలువ గల మద్యం కేసులకు సంబంధించి 81 ఎకై ్సజ్ కేసులు నమోదు చేసి 1050.23 లీటర్ల మద్యంను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే రూ.7,200 విలువ గల ఉచితాల పంపిణీకి సంబంధించి ఒక కేసు, 3 ఎన్నికల నిబంధన ఉల్లంఘన కేసులు, 4 మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) ఉల్లంఘటన నమోదు చేసినట్లు పేర్కొన్నారు. భద్రతా చర్యల్లో భాగంగా 70 నాఖా బందీ ఆపరేషన్లు, 37 ఆయుధాల డిపాజిట్, 640 మందిని బైండ్ ఓవర్ చేయడం జరిగిందని, జిల్లా వ్యాప్తంగా 3 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన పర్యవేక్షణ కొనసాగించినట్లు వివరించారు. ఎన్నికల విధుల నిర్వహణకు మొత్తం 1249 మంది పోలీస్ అధికారులు, సిబ్బందిని నియమించి సమర్థవంతమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టామన్నారు.
జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి
ఈనెల 21న జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్‌ను ప్రజలు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ డి.జానకి గురువారం ఓ ప్రకటనలో సూచించారు. క్షణికావేశంలో జరిగిన తప్పులను సరిదిద్దుకోవడానికి లోక్ అదాలత్ ఒక ఉత్తమ అవకాశమని, రాజీకి అవకాశం ఉన్న అన్ని కేసుల్లో కక్షిదారులుపరస్పర సమ్మతితో రాజీ పడవచ్చని తెలిపారు. జిల్లావ్యాప్తంగా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదాలు, ఆస్తి విభజన, కుటుంబ, వైవాహిక వివాదాలు, బ్యాంకు రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్‌బౌన్స్ వంటి రాజీకి అర్హమైన అన్ని కేసుల్లో ఇరువర్గాల సమ్మతితో రాజీ కుదిరేలా చర్యలు తీసుకోవాలని ఎస్‌హెచ్‌ఓలు, కోర్టు డ్యూటీ అధికారులను ఆదేశించారు.


