సర్పంచ్ అభ్యర్థి ఇంటి ఎదుట క్షుద్రపూజలు
మక్తల్: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మండలంలోని కాచ్‌వార్ గ్రామంలో అభ్యర్థి ఇంటి ఎదుట క్షుద్రపూజలు చేయడం కలకలం రేపుతోంది. సర్పంచు ఎన్నికల్లో తమను ఓడించేందుకు ప్రత్యర్థి వర్గం తన ఇంటి ఎదుట క్షుద్రపూజలు చేశారని బీఆర్‌ఎస్ అభ్యర్థి వెంకటమ్మ ఆరోపించారు. ఇంటి ముందు తెల్ల ఆవాలు, చనిపోయిన తర్వాత మృతదేహంపై చల్లే మొలకెత్తిన గింజలు, ఇసుక చల్లారని ఆందోళన వ్యక్తం చేశారు. తమ ఇంటి ముందే కాకుండా తమకు మద్దతు ఇస్తున్న వారి ఇంటి వద్ద క్షుద్రపూజలు చేస్తున్నారని వాపోయారు. ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని, ఇలాంటి పనులు చేయొవద్దని హితువు పలికారు. తమకు ఏమైనా జరిగితే ప్రత్యర్థి వర్గం వారు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కాచ్‌వార్ గ్రామంలో సర్పంచు పదవి బీసీ మహిళకు రిజర్వ్ అయింది. బరిలో నిలిచిన ప్రత్యర్థి మహిళా అభ్యర్థి మామనే ఈ పని చేసినట్లు గ్రామస్తుల ఎదుట ఒప్పుకున్నారు. ఈ తతంగం అంతా జరుగుతుండగానే వెంకటమ్మ భర్తకు గుండెనొప్పి రాగా చికిత్స కోసం అంబులెన్స్‌ల్లో మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రి వెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో ఈ ఘటన జరగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
● ‘పాలమూరుశ్రీలో ముంపునకు గురవుతుండడంతో తరలింపు
● ఉదండాపూర్, వల్లూరులో
భావోద్వేగానికి గురువుతున్న గ్రామస్తులు


