మార్కెట్‌లోకి ఎంజీ హెక్టర్ నూతన మోడల్
పాలమూరు: ఎంజీ హెక్టర్ నూతన మోడల్‌ను సోమవారం నగరంలోని ఏనుగొండ షోరూంలో కంపెనీ ఏఎస్‌ఎం టేజా కిలారి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా షోరూం ఎండీ వేణుగోపాల్‌సింగ్ మాట్లాడుతూ.. కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన ఎంజీ హెక్టర్ సీవీటీ పెట్రోల్ మోడల్‌లో ఆకర్షిణీయమైన ఫీచర్స్ ఉన్నాయన్నారు. ఆరా హెక్సాగ్ రిల్, ఆధునిక ఐఎస్‌ఎంఐఐఈ టెక్నాలజీ, పనోరామిక్ సన్‌రూఫ్ ఉంటుందన్నారు. ఆరా స్కల్ప్ బంపర్లు, స్టైలిష్ ఆరా బోల్ట్ అలాయ్ వీల్స్, 14 ఇంచుల పోర్ర్‌టెయిట్ టచ్ స్క్రీన్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మహబూబ్‌నగర్‌లో ఎంజీ హెక్టర్ వాహనాలకు మంచి స్పందన లభిస్తోందని, ఈ కొత్త వేరియంట్ కస్టమర్లకు అత్యుత్తమంగా ఉపయోగపడుతుందన్నారు.
మార్కెట్‌లోకి ఎంజీ హెక్టర్ నూతన మోడల్


