రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి
చిన్నచింతకుంట: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన ఘటన చిన్నచింతకుంట మండలంలోని పెద్దవడ్డెమాన్–నెల్లికొండి మధ్యలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ ఓబుల్‌రెడ్డి కథనం ప్రకారం.. కౌకుంట్ల మండలంలోని అప్పంపల్లికి చెందిన తెలుసు మధు బైక్‌పై నెల్లికొండి నుంచి వడ్డేమాన్‌వైపు వస్తున్నాడు. వడ్డెమాన్ నుంచి నెల్లికొండి వైపు వెళ్తున్న బొలేరో డ్రైవర్ అజాగ్రత్తగా నడుపుతూ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్ రోడ్డుపక్కకు పడిపోగా.. మధుకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఎలాంటి ఫిర్యాదు అందక పోవడంతో కేసు నమోదు చేయలేదని తెలపారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నాడు.
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన
మృతుడు తెలుగు మధు కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఘటనా స్థలం వద్ద రోడ్డుపై బైఠాయించారు. బొలేరో డ్రైవర్ అజాగ్రత్తతోనే ఓ నిండు ప్రాణం బలైందని ఆరోపించారు. మృతుడి కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించమని భీష్మించారు. ఘటనా స్థలానికి సీఐ రామకృష్ణ చేరుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ వారు ఆందోళనను విరమించలేదు.
భవనంపై నుంచిపడి తాపీమేసీ్త్ర మృతి
పెంట్లవెల్లి: మండల కేంద్రంలో ఇంటినిర్మాణం చేపడుతుండగా.. ప్రమాదవశాత్తు భవనం పైనుంచి పడిన ఘటనలో తాపీమేసీ్త్ర బత్తిని వెంకటేశ్(46) మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ రామన్‌గౌడ్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నూతన భవనం నిర్మాణంలో భాగంగా సెంట్రింగ్ తొలగిస్తుండగా.. ప్రమాదవశాత్తు మొదటి అంతస్తు పైనుంచి కాలుజారి కిందపడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కొల్లాపూర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందినట్లు ఎస్‌ఐ తెలిపారు.
రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి


