టోర్నీలో ప్రతిభ చాటాలి
మహబూబ్‌నగర్ క్రీడలు: హైదరాబాద్‌లో మంగళవారం నుంచి జరుగనున్న హెచ్‌సీఏ ఇంటర్ స్కూల్స్ వన్‌డే నాకౌట్ టోర్నీలో జిల్లా జట్టు మెరుగైన ప్రతిభ కనబర్చాలని ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ అన్నారు. పిల్లలమర్రి రోడ్డు సమీపంలోని ఎండీసీఏ మైదానంలో టోర్నీలో పాల్గొననున్న అండర్– 14 జిల్లా బాలుర క్రికెట్ జట్టును సోమవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టోర్నీలో క్రీడాకారులు ఉత్తమ ప్రదర్శన కనబర్చాలన్నారు. సమష్టిగా ఆడితే విజయం సాధించవచ్చని సూచించారు. టోర్నీలో గ్రూప్– ఏలో జిల్లా జట్టు మొదటి మ్యాచ్‌లో ఎస్‌టీ మైకల్స్ స్కూల్ (ఆల్వాల్) జట్టుతో తలపడనుందని పేర్కొన్నారు కార్యక్రమంలో కోచ్‌లు గోపాలకృష్ణ, ముఖ్తార్‌అలీ, సీనియర్ క్రీడాకారుడు రంజిత్‌కుమార్ పాల్గొన్నారు.
అండర్–14 క్రికెట్ జట్టు
రాహుల్ రైన (మహబూబ్‌నగర్), అర్హాన్, జైద్ (జడ్చర్ల), సాయిహర్షిత్ (మహబూబ్‌నగర్), రాఘవ, పునీత్ (జడ్చర్ల), వెంకటసాయి– కెప్టెన్, కార్తీకేయ (గద్వాల), సాయిరాం (మహబూబ్‌నగర్), జోసెఫ్ (జడ్చర్ల), హృతిక్ (వనపర్తి), చరణ్‌తేజ (జడ్చర్ల), సాత్విక్, సోహైల్, ధనుష్ (మహబూబ్‌నగర్), కోచ్ ముఖ్తార్ అలీ.


