బాండ్ పేపర్‌పై ఆస్తుల ప్రకటన
వనపర్తి రూరల్: పెబ్బేరు మండలంలోని కంచిరావుపల్లి గ్రామంలో కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి బత్తుల బాలగౌడ్ తన ఆస్తులను బాండ్ పేపర్‌పై ప్రకటించారు. ఎన్నికల చివరి రోజైన సోమవారం ప్రజలతో సమావేశం నిర్వహించి ఆస్తులను ప్రకటించాడు. తనకు రెండు రూములు, 15/40 ఖాళీ స్థలం, చెరువు కింద 10 గుంటల భూమి, హీరోహోండా బైక్ కలదని పేర్కొన్నాడు. ఈ రోజు ఎన్ని ఆస్తులు ఉన్నాయో పదవీకాలం పూర్తయిన తర్వాత కూడా అదే ఆస్తులతో ఉంటానని చెన్నకేశవస్వామిపై ప్రమాణం చేసి బాండ్ పేపరును ప్రజలకు అందజేశారు. ఒకవేళ ఈ ఆస్తుల కన్నా ఎక్కువ సంపాదిస్తే గ్రామానికి అందజేస్తానని అన్నారు.
సర్పంచ్ అభ్యర్థి వినూత్న ప్రచారం


