డబ్బులు డిమాండ్ చేస్తే చర్యలు
బల్మూర్: ఎన్నికల నియమావళి ప్రకారం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు అభ్యర్థులను డబ్బులు డిమాండ్ చేసినా అభ్యర్థులు ఓటర్లకు డబ్బులు ఇచ్చినా చర్యలు తప్పవని డీఎస్పీ శ్రీనివాస్ హెచ్చరించారు. డబ్బులు ఇచ్చినోళ్లకే ఓటేస్తాం’ అనే శీర్షికన శుక్రవారం సాక్షి పత్రికలో వెలువడిన కథనానికి డీఎస్పీ స్పందించి అచ్చంపేట సీఐ నాగరాజుతో కలిసి లక్ష్మిపల్లి గ్రామాన్ని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో గురువారం స్థానిక కూడలిలో అభ్యర్థులను కొంత మంది ఓటర్ల డబ్బులు డిమాండ్ చేసిన విషయంపై విచారించారు. అభ్యర్థులు ఓటర్లకు డబ్బులు ఇవ్వొద్దని సూచించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేయాలని కోరారు. గ్రామస్తులు సహరించాలని కోరారు.


