పోలింగ్ ఏజెంట్లే కీలకం
● గ్రామ ఓటర్లనే నియమించుకోవాలి ● వార్డుల్లో వార్డు ఓటరై ఉండాలి
● దొంగ ఓట్లను గుర్తించేది స్థానికులే..
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఎన్నికల రోజు పోలింగ్ ఏజెంటే కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీలో సర్పంచ్, వార్డుకు పోటీ చేస్తున్న ప్రతివ్యక్తి, ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక ఏజెంట్‌ను నియమించుకోవాలి. సదరు ఓటర్లను గుర్తించేది. ఏజెంట్స్ కావడంతో సర్పంచ్ పోటీచేసే ప్రతి అభ్యర్థి వార్డు సభ్యుడిగా పోటీచేసే అభ్యర్థి కీలకమైన వ్యక్తిని నియమించుకుంటేనే వారి గెలుపు సాధ్యమవుతుంది. సర్పంచ్ పదవికి పోటీచేసే వ్యక్తులు ఏ వార్డు నుంచైనా వార్డు మెంబర్ అయితే ఏ వార్డు నుంచి పోటీ చేస్తున్నారో అదే వార్డుకు సంబంధించిన ఓటరును పోలింగ్ ఏజెంట్‌గా నియమించుకోవాలనే నిబంధన ఉంది. ఏదైనా కారణాలతో ఇతరులను నియమించుకోవాల్సి వస్తే ముందే ఎన్నికల రిటర్నింగ్ అధికారికి రాతపూర్వకంగా తెలియజేయాలి. దానిని పరిశీలించి అనుమతిస్తే తప్పా ఇతరులను నియమించుకునేందుకు వీల్లేదు.
పోలింగ్ ఏజెంట్లే కీలకం


