నాడు మామ.. నిన్న అత్త.. నేడు కోడలు...
సర్పంచ్ బరిలో అక్కా తమ్ముడు
● ఆ కుటంబానికే మూడోసారి సర్పంచ్ గిరి
నవాబుపేట: మండలంలోని అమ్మాపూర్ సర్పంచ్‌గా రావలీల గెలుపొందారు. సర్పంచ్ ఎన్నికల బరిలో ఒకే కుటుంబం నుంచి ముచ్చటగా మూడోసారి నిలిచి విజయం సాధించింది. ఆమె మామ అంతయ్య 1995లో సర్పంచ్‌గా గెలిచారు. 2001లో మహిళా రిజర్వేషన్ కావడంతో ఆయన భార్య అరుణమ్మ సర్పంచ్ బరిలో నిలిచి విజయం సాధించారు. తాజాగా అంతయ్య కోడలు రావలీలకు మూడోసారి సర్పంచ్ గిరి దక్కింది.
ఎంపీటీసీ మాజీ సభ్యురాలు.. తాజా సర్పంచ్
తీగలపల్లి ఎంపీటీసీ మాజీ సభ్యురాలు లక్ష్మమ్మ తాజాగా కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్‌గా విజయం సాధించారు. ఈమె భర్త నారాయణ కూడా గతంలో టీడీపీ మద్దతుతో సర్పంచ్‌గా పనిచేశారు.
తక్కువ వయస్కులే ఎక్కువ..
మండలంలో మొత్తం 42 గ్రామపంచాయతీలు ఉండగా.. ఇందులో 16 జీపీల్లో 30 నుంచి 34 ఏళ్లలోపు వారే సర్పంచ్‌లుగా విజయం సాధించడం విశేషం. వీరిలో ఇప్పటూర్, కారుకొండ సర్పంచ్‌లు రవికిరణ్, సంతోషికుమారి 31 ఏళ్లవారు కాగా.. పుట్టోనిపల్లి సంగీత, దేపల్లి ప్రణవి, నవాబుపేట గీతారాణి, పోమాల్ కవిత, అమ్మాపూర్ రవలీల, జంగమయ్యపల్లి విశాల, రుద్రారం రవి, యన్మన్‌గండ్ల రంజిత్‌కుమార్‌గౌడ్, కారూర్ శంకర్, రాంసింగ్‌తండా జ్యోతి, కాకర్‌జాల్‌తండా సంతోష్‌నాయక్, సిద్దోటం మల్లేష్‌గౌడ్, చెన్నారెడ్డిపల్లి నవనీత, బట్టోనిపల్లి స్వాతి 34 ఏళ్లలోపు వారే.
స్థానిక ఎన్నికల సందడి రసవత్తరంగా సాగుతోంది. అయితే, లింగాల మండలంలోని క్యాంపురాయవరం సర్పంచ్ బరిలో అక్కా తమ్ముడు నిలవడంతో అందరి చూపు ఈ పంచాయతీ వైపు పడింది. ఈ పంచాయతీ బీసీ జనరల్‌కు రిజర్వు కాగా.. కాంగ్రెస్ మద్దతుతో అక్క పెర్మళ్ల నాగవేణి పోటీలో ఉండగా.. ప్రత్యర్థిగా బీఆర్‌ఎస్ మద్దతుతో తమ్ముడు బొల్లు నరేష్ తలపడుతున్నాడు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో క్యాంపురాయవరం కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పాటు అయ్యింది. ఇక్కడ 450 మంది వరకు ఓటర్లు ఉన్నారు. గతంలో రాయవరం ఉమ్మడి గ్రామ పంచాయతీ పరిధిలో ఈ గ్రామం ఉండేది. తమను సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామ పంచాయతీ అభివృద్ధికి తమ వంతుగా కృషి చేస్తామని ఇరువురు అభ్యర్థులు ఓటర్లకు భరోసా కల్పిస్తున్నారు. – లింగాల
నాడు మామ.. నిన్న అత్త.. నేడు కోడలు...
నాడు మామ.. నిన్న అత్త.. నేడు కోడలు...


