అట్టహాసంగా హ్యాండ్‌బాల్ టోర్నీ
● పాల్గొన్న ఉమ్మడి జిల్లాల బాల, బాలికల జట్లు
● పోటీలు ప్రారంభించిన డీఐఈఓ కౌసర్ జహాన్, పారిశ్రామికవేత్త బెక్కరి రాంరెడ్డి
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలో శుక్రవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్– 19 రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్ అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్రస్థాయి పోటీల్లో రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాల బాల, బాలికల జట్లు పాల్గొనున్నాయి. బాలికలకు మహబూబ్‌నగర్ ఉన్నత పాఠశాలలో హైస్కూల్‌లో, బాలురకు హీరా మోడల్ పాఠశాల మైదానంలో పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 14వ తేదీ వరకు పోటీలు జరుగనున్నాయి.
గెలుపోటములు సమానంగా స్వీకరించాలి
రాష్ట్రస్థాయి అండర్– 19 ఎస్‌జీఎఫ్ హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్‌ను డీఐఈఓ కౌసర్ జహాన్, పారిశ్రామికవేత్త బెక్కరి రాంరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ముందుగా జ్వోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా డీఐఈఓ మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి టోర్నీలో ఉమ్మడి జిల్లాల బాల, బాలికల జట్లు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. క్రీడలు ఆడేవారు చదువులో కూడా ముందుంటారన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరించి క్రీడాస్ఫూర్తి చాటాలని పిలుపునిచ్చారు. ఓటమి తర్వాతే గెలుపు సాధ్యమన్నారు. పారిశ్రామిక వేత్త బెక్కరి రాంరెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. టోర్నీలో నైపుణ్యాన్ని ప్రదర్శించాలన్నారు. ఉమ్మడి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్ మాట్లాడుతూ.. దాతల సహకారంతోనే రాష్ట్రస్థాయి టోర్నీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇటీవలే జిల్లా కేంద్రంలో రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నీని విజయవంతంగా నిర్వహించామన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సంప్రదాయ నృత్యం ఆకట్టుకుంది. కార్యక్రమంలో టోర్నీ రాష్ట్ర పరిశీలకులు శ్రీనివాస్, పుల్లయ్య, ఎస్‌జీఎఫ్ జిల్లా కార్య నిర్వాహక కార్యదర్శి డాక్టర్ శారదాబాయి, స్పోర్ట్స్ ఇన్‌చార్జి వేణుగోపాల్, అండర్– 19 ఎస్‌జీఎఫ్ మాజీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి పాపిరెడ్డి, రజినీకాంత్‌రెడ్డి, ఎండీ జియావుద్దీన్, బాల్‌రాజు, రాంమోహన్, ప్రదీప్‌కుమార్, అహ్మద్ హుస్సేన్ పాల్గొన్నారు.
శుభారంభం చేసిన పాలమూరు
హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్‌లో ఆతిథ్య పాలమూరు ఉమ్మడి బాలుర జట్టు శుభారంభం చేసింది. మొదటి మ్యాచ్‌లో 10– 5 గోల్స్ తేడాతో ఆదిలాబాద్ జట్టుపై విజయం సాధించింది. బాలికల విభాగంలో ఆదిలాబాద్ జట్టు 9– 6 గోల్స్ తేడాతో నల్లగొండ జట్టుపై గెలుపొందింది.
అట్టహాసంగా హ్యాండ్‌బాల్ టోర్నీ
అట్టహాసంగా హ్యాండ్‌బాల్ టోర్నీ


