ష్.. గప్‌చుప్
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత పోలింగ్‌కు సమయం దగ్గర పడింది. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం సైతం ముగిసింది. ఆరు రోజుల పాటు గ్రామాల్లో హోరెత్తిన ప్రచారం, మైక్‌ల చప్పుడు ఇప్పుడు మూగబోయింది. ఇప్పటికే ప్రలోభాలకు తెరలేపారు. అభ్యర్థులందరూ ఈ నిశ్శబ్ద సమయాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. రెండో విడతలో హన్వాడ, చిన్నచింతకుంట, దేవరకద్ర, కోయిల్‌కొండ, కౌకుంట్ల, మిడ్జిల్ మండలాల పరిధిలోని 151 సర్పంచ్, 1,334 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహిస్తారు. ఈ విడతలో 475 మంది సర్పంచ్ అభ్యర్థులు, 2,871 మంది వార్డు సభ్యులుగా బరిలో నిలిచారు.
6 కేంద్రాల్లో
సామగ్రి పంపిణీకి ఏర్పాట్లు
ఎన్నికలు జరిగే గ్రామపంచాయతీల్లో విధులు నిర్వహించే పీఓలు, ఓపీఓలకు శనివారం పోలింగ్ సామగ్రిని అందజేయనున్నారు. ఇందుకోసం చిన్నచింతకుంట మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, దేవరకద్రమార్కెట్‌యార్డులో, హన్వాడ బాలిక ఉన్నత పాఠశాల, కోయిల్‌కొండ రైతు వేదికలో, కౌకుంట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, మిడ్జిల్ ఎంపీడీఓ కార్యాలయంలో ఆయా గ్రామ పంచాయతీల వారీగా కేటాయించిన పీఓలు, ఓపీఓలకు సామగ్రిని అందజేస్తారు.
● ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం
● రేపు 6 మండలాల్లో 151 గ్రామపంచాయతీల్లో పోలింగ్
ష్.. గప్‌చుప్


