పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
జవహార్ నవోదయ విద్యాలయం 2026–27 విద్యా సంవత్సరం ఆరో తరగతి ప్రవేశ పరీక్ష నిర్వహణకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. మొత్తం 29 పరీక్ష కేంద్రాలలో 7,115 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ప్రవేశ పరీక్ష రాసే విద్యార్థులు ఆన్‌లైన్‌లో హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలి. విద్యార్థులు నిర్ణీత సమయానికి గంట ముందే ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.
– భాస్కర్‌కుమార్, ప్రిన్సిపల్,
వట్టెం నవోదయ విద్యాలయం
●


