ప్రతి ఒక్కరికీవైద్యం అందాలి
పాలమూరు: ఆర్థిక అంశాలతో సంబంధం లే కుండా ప్రతి ఒక్కరికీ కావాల్సిన ఆరోగ్య సేవ లు అందుబాటులో ఉండేలా చూడటమే యూ నివర్సల్ హెల్త్ కవరేజ్ లక్ష్యం అని జిల్లా న్యా య సేవా అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర అన్నారు. సర్వ సామాన్య ఆరోగ్య పరిరక్షణ దినోత్సవం సందర్భంగా జిల్లా జనరల్ ఆస్పత్రిలో నిర్వహించిన కార్యక్రమానికి న్యాయమూర్తి హాజరై మాట్లాడారు. రోగులకు న్యాయ సలహాలు అందించడానికి ప్రతి సోమవారం ఆస్పత్రిలో పారాలీగల్ వలంటీర్లు అందుబా టులో ఉంటారని తెలిపారు. అనంతరం జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రంగా ఆజ్మీరా మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి మెరుగైన ఆరోగ్య సేవలు అందించే బాధ్యత వైద్యులపై ఉందన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఓడీలు డాక్ట ర్ సురేష్, డాక్టర్ అమరావతి, లక్ష్మీప్రసన్న, డాక్టర్ ప్రేరణ, ఆర్‌ఎంఓ జరీనా పాల్గొన్నారు.
● నగరంలోని పాతపాలమూరు అర్బన్ హెల్త్ సెంటర్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర హాజరై మాట్లాడారు. మదీన మజీద్ హైస్కూల్, మార్కెట్ రోడ్ హైస్కూల్‌లో బాల్య వివాహాలపై న్యాయమూర్తి ఇందిర అవగాహన కల్పించారు.
రెండోదశ ఎన్నికలకుపోలీస్‌శాఖ సన్నద్ధం: ఎస్పీ
మహబూబ్‌నగర్ క్రైం: రెండో దశ ఎన్నికలు హన్వాడ, కోయిలకొండ, మిడ్జిల్, దేవరకద్ర, చిన్నచింతకుంట, కౌకుంట్ల మండలాల పరిధిలో ఉన్న గ్రామాల్లో నిర్వహిస్తున్న క్రమంలో ఆయా పోలింగ్‌స్టేషన్లలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి పోలీస్ సిబ్బంది కృషి చేయాలని ఎస్పీ డి.జానకి వెల్లడించారు. జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి ఆయా అధికారులతో శుక్రవారం ఎస్పీ మాట్లాడారు. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేశామని, ఎన్నికల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా బీఎన్‌ఎస్ 163 అమల్లో ఉండటం వల్ల పోలింగ్ కేంద్రాల చుట్టూ వంద మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉండరాదన్నారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు నిశ్శబ్దకాలం అమల్లో ఉండటం వల్ల ఇంటింటా ప్రచారం లేదా ర్యాలీలు అన్నింటిని నిషేధించినట్లు చెప్పారు. ఎన్నికలు జరిగే మండలాల పరిధిలో ఉన్న మద్యం దుకాణాలు సైతం ఈనెల 15 ఉదయం 10 గంటల వరకు మూసి ఉంచాలన్నారు. మద్యం అక్రమ రవాణా చేసినా, నిల్వ చేసినా కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పోలింగ్ అనంతరం విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు పూర్తిగా నిషేధమన్నారు.
నేడు జిల్లా మాస్టర్ అథ్లెటిక్స్ జట్టు ఎంపిక
మహబూబ్‌నగర్ క్రీడలు: కరీంనగర్ జిల్లాలో ఈనెల 27, 28 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి అంతర్‌జిల్లాల మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టు ఎంపికనే నేడు (శనివారం) స్థానిక మెయిన్ స్టేడియంలో ఉదయం 9 గంటలకు నిర్వహిస్తున్నట్లు మాస్టర్ అథ్లెటిక్స్ అధ్యక్ష, కార్యదర్శులు జాజిమొగ్గ నర్సింహులు, సునీల్‌కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగలవారు ఆధార్‌కార్డుతో ఎంపికలకు హాజరుకావాలని కోరారు. మిగతా వివరాల కోసం సునీల్‌కుమార్ 9440656162 నంబర్‌ను సంప్రదించాలని వారు సూచించారు.
ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం
క్వింటా రూ.2,851
జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డు కు శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి దాదా పు 3,500 క్వింటాళ్ల పంట దిగుబడులు విక్రయానికి వచ్చాయి. 3,000 క్వింటాళ్ల ధాన్యం రాగా ఆర్‌ఎన్‌ఆర్ క్వింటా గరిష్టంగా రూ. 2,851, కనిష్టంగా రూ.1,730 ధరలు లభించాయి. హంస రకానికి గరిష్టంగా రూ.1,902, కనిష్టంగా రూ.1,730, చిట్టిముత్యాలు గరిష్టంగా రూ.4,169, కనిష్టంగా రూ.3,125, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,972, కనిష్టంగా రూ.1,956 ధరలు లభించాయి.


