రెండో విడతకు పకడ్బందీ ఏర్పాట్లు
● ఉద్యోగులు ఎన్నికల విధులకు హాజరు కాకపోతే చర్యలు
● జిల్లా ఎన్నికల అధికారి విజయేందిర బోయి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): అన్ని శాఖల అధికారుల టీమ్ వర్క్‌తో మొదటి విడత ఎన్నికలు సజావుగా జరిగాయని, ఈ నెల 14వ తేదీన జరిగే రెండో విడత ఎన్నికలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయేందిర పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి వీసీ నిర్వహించారు. రెండో విడత పోలింగ్ కేంద్రాలకు చెక్‌లిస్టు ప్రకారం సామగ్రిని పంపిణీ చేయాల ని సూచించారు. పోలింగ్‌కేంద్రాలలో అన్ని మౌలిక సదుపాయాలు ఉండాలని, ఓటింగ్‌కి సంబంధించి ఇచ్చే నివేదికలన్నీ పూర్తి సమాచారంతో ఉండాలన్నారు. పంపిణీ కేంద్రాల్లో పోలింగ్ బృందాల జాబి తా అందరికీ కనిపించే విధంగా ప్రదర్శించాలన్నా రు. జోన్‌లు, రూట్ల వారీగా గ్రామపంచాయతీ వార్డులతో బ్యానర్ ప్రదర్శించి, అవసరమైన ఏర్పా టు చేయాలని సూచించారు. పీఓ, ఓపీఓలు, జోన ల్ అధికారులు డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి ఉదయం 9 గంటలకు చేరుకోవాలని, పోలింగ్ బృందాల జాబితా ప్రకారం ఉద్యోగి ఐడీ, పేరు, సంతకంతో హాజరు తీసుకోవాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో విధులకు రాని ఉద్యోగుల గైర్హాజరు జాబితా మధ్యాహ్నం 12 గంటల వరకు తహసీల్దార్లుకు అందజేయాలన్నారు. విధులకు హాజరు కాకపోతే కఠినచర్యలు తీసుకుంటామని, వారికి షోకాజ్, సస్పెన్షన్ చేయనున్నట్లు హెచ్చరించారు. పోలింగ్‌ముగిసిన తర్వాత ఓట్లు లెక్కించేందుకు అవసరమైన టేబుల్స్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఫలితాలు వెల్లడైన తరువాత ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ కూడా వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. తహసీల్దార్, ఎంపీడీఓ, మండల స్పెషల్ అధికారులు సమన్వయంగా పని చేసి పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేలా కృషి చేయాలన్నారు. వీసీలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జెడ్పీ సీఈఓ వెంకటరెడ్డి, ఆర్‌డీఓ నవీన్, డీఈఓ ప్రవీణ్ కుమార్, డ్రెయినీ డీపీఓ నిఖిలశ్రీ పాల్గొన్నారు.


