జీవితంలో సవాళ్లను అధిగమించాలి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులు జీవితంలో సవాళ్లును అధిగమించి ఎదగాల్సిన అవసరముందని పీయూ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు పీయూలో ఎన్‌ఎస్‌ఎస్ సెల్ ఆధ్వర్యంలో బీయండ్ యువర్ మైండ్ సంస్థ సౌజన్యంతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. వచ్చిన సవాళ్లను అధిగమించినప్పుడే కొత్త అవకాశాల్లో ఉన్నత స్థానాలు లభిస్తాయని, చదువులు ఎదుగుదలలో విద్యార్థులు భావోద్వేగాలను నియంత్రించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రస్తుత ప్రపంచంలో యువతకు అనేక అవకాశాలు ఉన్నాయని, వాటినికి వినియోగించుకుని అద్భుతాలను సృష్టించ్చవని, ఆన్‌లైన్ విధానంలో ఆర్టిఫిషీయల్ ఇంటలిజెన్స్ ఎంతో కీలకంగా వ్యవహరిస్తుందని అందులోని అంశాలను తెలుసుకోవాలని, వాటిద్వారా మనిషి జీవితం సులభతరం అవుతుందన్నారు. ఇటీవల ఆర్చరీలో రాష్ట్రస్థాయిలో విద్యార్థి గోల్డ్‌మెడల్ సాధించడం గొప్ప విషయమన్నారు. కీనోట్ స్పీకర్ సరోజ గుల్లపల్లి మాట్లాడుతూ.. నేటికాలంలో బాలికలు అన్నిరంగాల్లో రాణిస్తురన్నాని, అంతరిక్షయానం మొదలుకొని అంతర్జాతీయ స్థాయి సంస్థల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారని, వారిని నేటితరం బాలికలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సమస్యను సమస్యగా భావించకుండా దాన్ని ఎదుర్కొనే మార్గాన్ని గుర్తించాలని, ప్రతి అంశం నుంచి అనుభవాన్ని గడించి జీవితంలో ముందుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేశ్‌బాబు, ఎన్‌సెఎస్ కోఆర్డినేటర్ ప్రవీణ, ప్రిన్సిపాల్ మధుసూదన్‌రెడ్డి, రవికాంత్, భూమయ్య, రవికుమార్, అర్జున్‌కుమార్, రాఘవేందర్, గాలెన్న, /్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
పీయూ వీసీ శ్రీనివాస్
జీవితంలో సవాళ్లను అధిగమించాలి


