ఓటుహక్కు వినియోగించుకోండిలా..!
మహబూబ్‌నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలో నేడు (గురువారం) పంచాయతీ ఎన్నికలు ఉండగా మొదటి విడతలో 492 చోట్ల ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓటర్లు కింద నిబంధనలు పాటిస్తూ ఓటుహక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది.
● పోలింగ్ సమయం: ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు
● అర్హులు: సదరు గ్రామ పంచాయతీలో ఓటరు జాబితాలో పేరు నమోదై ఉన్నవారు మాత్రమే.
● ఈ గుర్తింపు కార్డులు తప్పనిసరి: ఓటురు గుర్తింపు కార్డు పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లాలి. లేని పక్షంలో ఆధార్, పాస్‌పోర్టు, రేషన్‌కార్డు, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఉపాధి హామీ జాబ్‌కార్డు, ఫోటో ఉన్న బ్యాంకు లేదా పోస్టాఫీస్ ఖాతా పాస్‌బుక్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగుల గుర్తింపు కార్డు, పెన్షన్ పొందే గుర్తింపు కార్డు తీసుకెళ్లవచ్చు.
● ఒక్కో వార్డుకు ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తుండగా సర్పంచ్ అభ్యర్థి, వార్డు అభ్యర్థికి ఒకేసారి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు.
● సర్పంచ్ అభ్యర్థికి గులాబీ రంగు, వార్డు అభ్యర్థికి తెలుపు బ్యాలెట్ పత్రాలు ఇస్తారు.
● నచ్చిన అభ్యర్థుల గుర్తుపై స్వస్తిక్ ముద్రవేసి ఒకే బ్యాలెట్ డబ్బాలో వేయాల్సి ఉంటుంది.


