పుంజుకున్న ఉల్లి ధరలు
దేవరకద్ర: స్థానిక మార్కెట్‌లో బుధవారం జరిగిన వేలంలో ఉల్లి ధరలు మరింత పుంజుకున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌కు వానాకాలం సీజన్ కింద పండించిన కొత్త ఉల్లి మార్కెట్‌కు అమ్మకానికి వస్తోంది. ప్రారంభంలో రూ.వెయ్యి దాటని ధరలు ప్రస్తుతం రూ. 2,000కు చేరువగా పలుకుతోంది. వేలంలో గరిష్ట ధర రూ. 1,900, కనిష్టంగా రూ. 1,000గా లభించాయి. వ్యాపారులు పోటా పోటీగా వేలం పాడి కొనుగోళ్లు చేపట్టారు. 50 కేజీల ఉల్లి బస్తా గరిష్టంగా రూ.1,000, కనిష్టంగా రూ.500గా అమ్మకాలు సాగించారు. దాదాపు అయిదు వందల బస్తాల ఽఉల్లి అమ్మకానికి వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.


