జైలు జీవితం మంచిగా మారేందుకు అవకాశం
పాలమూరు: జైలులో శిక్ష అనుభవించే ఖైదీలు సత్ప్రవర్తనతో ఉంటూ బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ వారి హక్కులు తెలుసుకొని బాధ్యతగా మెలగాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర అన్నారు. అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లా జైలులో ఖైదీలకు అవగాహన సదస్సు నిర్వహించారు. వ్యక్తిగత హక్కుల ఉల్లంఘనకు పాల్పడితే నేరం అవుతుందని, బాధ్యతను మరిచి ఎవరూ ప్రవర్తించరాదన్నారు. నేర ఆరోపణలతో జైలుకు వచ్చి స్వేచ్ఛ హక్కును కోల్పోతున్నారని, ఇక్కడ శిక్ష కాలంలో ఉత్తమ జీవనం గడిపి బయటకు వెళ్లిన తర్వాత ఎలాంటి తప్పులు చేయరాదన్నారు. తప్పు చేసిన మనిషికి జైలు అనేది మారడానికి ఒక అవకాశంగా భావించాలన్నారు. తమపై ఆధారపడిన కుటుంబాలు, తల్లిదండ్రుల బాధ్యతలను గుర్తుపెట్టుకుని సమాజంలో గౌరవంగా బ్రతకలన్నారు. ఖైదీల సంక్షేమం విషయంలో ఇబ్బంది జరిగితే వెంటనే జైలు అధికారులకు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ వెంకటేశం, న్యాయవాదులు రవీందర్, కృష్ణ, యోగేశ్వర్‌రాజ్, కార్తీక్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బాలోత్సవ ప్రవేశానికి గడువు పెంపు
స్టేషన్ మహబూబ్‌నగర్: పిల్లలమర్రి బాలోత్సవం 4వ పిల్లల జాతరలో పాల్గొనడానికి గూగుల్ ఫారం పంపేందుకు గడువు ఈనెల 10వ తేదీ ఉండగా దానిని ఈనెల 15 వరకు పెంచినట్లు ఆ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ వీరాంజనేయులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయుల విజ్ఞప్తుల మేరకు బాలోత్సవ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 19, 20 తేదీల్లో బృందావన్ గార్డెన్స్‌లో బాలోత్సవం జరుపుతున్నామని, ఇందులో ప్రవేశం పూర్తిగా ఉచితమని, ఎలాంటి ప్రవేశం రుసుము లేదని తెలిపారు. మరిన్ని వివరాల కోసం 93983 05993, 94909 09780 నంబర్లను సంప్రదించాలని కోరారు.
క్వింటా ఆర్‌ఎన్‌ఆర్ రూ.2,811
జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు బుధవారం వివిద ప్రాంతాల నుంచి దాదాపు 6వేల క్వింటాళ్ల పంట దిగుబడులు విక్రయానికి వచ్చాయి. ఆర్‌ఎన్‌ఆర్ క్వింటా గరిష్టంగా రూ.2,811, కనిష్టంగా రూ.1,996, హంస గరిష్టంగా రూ.2,265, కనిష్టంగా రూ.1,857, కందులు రూ.6,811, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,975, కనిష్టంగా రూ.1,836, పత్తి గరిష్టంగా రూ.6,759, కనిష్టంగా రూ.5,011 ఽ ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్‌లో ఆర్‌ఎన్‌ఆర్ గరిష్టంగా రూ.2,659, కనిష్టంగా రూ.2,350, హంస గరిష్టంగా రూ.1,961, కనిష్టంగా రూ.1,953గా ధరలు పలికాయి.
దరఖాస్తుల ఆహ్వానం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో స్టాటస్టికల్ సబ్జెక్టులో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేసేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ప్రిన్సిపాల్ పద్మావతి తెలిపారు. నెట్, సెట్, పీహెచ్‌డీ అర్హతలు కలిగినవారు దరఖాస్తులు చేసుకోవాలని ఈనెల 11, 12వ తేదీ వరకు అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్ష ఫీజులు చెల్లించాలి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు గురువారం నుంచి ఈ నెల 27వ తేదీ వరకు పరీక్ష ఫీజులు చెల్లించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని డీఈఓ ప్రవీణ్‌కుమార్, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ శివయ్య ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు థియరీ సబ్జెక్టులకు ఎస్సెస్సీ విద్యార్థులు రూ.100, ప్రాక్టికల్స్‌కు రూ.100, ఇంప్రూమెంట్‌కు రూ.200 చెల్లించాలని తెలపారు. ఇంటర్ వారు థియరీ సబ్జెక్టులకు రూ.150, ప్రాక్టికల్స్‌కు రూ.150, ఇంప్రూమెంట్‌కు రూ.350 చెల్లించాలని కోరారు.
జైలు జీవితం మంచిగా మారేందుకు అవకాశం


