గట్టి బందోబస్తు..
మహబూబ్‌నగర్ క్రైం: మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా 1,088 మంది పోలీస్ బలగాలతో జిల్లా పోలీస్ శాఖ ముందస్తు చర్యలు చేపట్టారు. అభ్యర్థులు మద్దతుదారులతో ఎలాంటి గొడవలు కాకుండా దృష్టి సా రించారు. ప్రధానంగా గురువారం జరిగే మొదటి విడత ఎన్నికలపై ప్రత్యేక నిఘా పెట్టారు. ప్రతి పో లింగ్ కేంద్రం ఇద్దరు సిబ్బంది విధుల్లో ఉంటారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద ముగ్గురు లేదా నలుగురు బందోబస్తు నిర్వహిస్తారు. ఓటర్లు, వార్డుల సంఖ్యతో పాటు ఆయా పోలింగ్ కేంద్రాల పరిస్థితి ఆధారంగా సిబ్బందిని కేటాయిస్తున్నారు. రెండో దశలో మూడు నుంచి నాలుగు గ్రామాలకు కలిపి ఒక రూట్‌గా నిర్ణయించి రూట్ మొబైల్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. మూడోదశలో పోలీస్‌స్టేషన్ స్థాయిలో సీఐ ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్స్, నాలుగో దశలో సర్కిల్ స్థాయిలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఐదో దశలో మండలానికి ఒక డీఎస్పీస్థాయి అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాల ద్వారా పర్యవేక్షణ చేస్తారు.
● నగరంలోని బాలికల జూనియర్ కళాశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని బుధవారం ఎస్పీ డి.జానకి సందర్శించి సిబ్బంది హాజరు, భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఎన్నికల విధులపై సూచనలు చేశారు. పోలింగ్‌కేంద్రంలో గొడవలు జరగకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రధానంగా క్యూలైన్‌లలో నిలబడి ఉన్న క్రమంలో గొడవలకు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. రాత్రి కోడూరు పంచాయతీలోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు.
1,088 మంది పోలీసులకు
విధుల కేటాయింపు
ప్రత్యేక రూట్ మొబైల్స్ ఏర్పాటు
సమస్యాత్మక కేంద్రాలపై
ప్రత్యేక నిఘా


