ఎన్నికల సామగ్రిని జాగ్రత్తగా పంపిణీ చేయాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామాలకు వెళ్లే పోలింగ్ సామగ్రిని జాగ్రత్తగా పంపిణీ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయేందిర సూచించారు. బుధవారం జిల్లాకేంద్రంలోని బాలిక జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన మహబూబ్‌నగర్ రూరల్ మండలం ఎన్నికల పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఏ చిన్న పొరపాటు జరగకుండా పీఓలు, ఓపీఓలకు సామగ్రిని అందించాలన్నారు. పంచాయతీ ఎన్నికలు సజావుగా, పారదర్శకంగా జరిగేందుకు అన్ని అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్‌లను నియమించినట్లు వెల్లడించారు. ఎన్నికలు విజయవంతంగా నిర్వహించేందుకు ప్రజలు తమ పూర్తి సహకారం అందించాలన్నారు. కార్యక్రమంలో ఉద్యానశాఖ అధికారి వేణుగోపాల్, ఎంపీడీఓ కరుణశ్రీ, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పంచాయతీ ఎన్నికల పరిశీలకురాలు కాత్యాయనీదేవి మహబూబ్‌నగర్ బాలికల జూనియర్ కళాశాల, రాజాపూర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు.


