బెల్ట్ షాపులపై దాడులు
మహబూబ్‌నగర్ క్రైం: ‘కోడ్ ఉన్నా బెల్ట్ జోరు’ అనే శీర్షికతో సాక్షి దినపత్రికలో మంగళవారం ప్రచురితమైన కథనానికి ఎకై ్సజ్ శాఖ అధికారులు స్పించారు. మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. కృష్ణా మండల పరిధిలోని హిందూపూర్‌లో నిర్వహిస్తున్న బెల్ట్ దుకాణంపై దాడులు చేసి సిద్దప్ప అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 7.72 లీటర్ల మద్యం సీజ్ చేయగా బస్వరాజ్ అనే వ్యక్తి ఇంట్లో ఆరు లీటర్ల మద్యం సీజ్ చేయడంతో పాటు ఇరువురిపై కేసులు నమోదు చేసినట్లు సీఐ అనంతయ్య వెల్లడించారు. నారాయణపేట ఎకై ్సజ్ సర్కిల్ పరిధిలో ఊట్కూర్ మండలం పులిమామిడిలో సోదాలు చేసి 2.52 లీటర్ల మద్యం సీజ్ చేశారు. జడ్చర్ల సర్కిల్ పరిధిలో రాజాపూర్‌లో 7.8 లీటర్ల బీరు, 0.550 లీటర్ల మద్యం, కావేరమ్మపేటలో లిక్కర్ 24.050 లీటర్లు, బీర్ 14.345 లీటర్లు పట్టుకున్నారు. గెగ్యా తండాలో రెండు లీటర్ల నాటుసారా సైతం సీజ్ చేశారు.
చట్టాలపై విద్యార్థులు విజ్ఞానం పెంచుకోవాలి
పాలమూరు: నగరంలోని మెట్టుగడ్డ దగ్గర ఉన్న స్టేట్ హోంతో పాటు బీసీ స్టడీ సర్కిల్‌లో మంగళవారం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో మానవ హక్కుల ప్రాముఖ్యత నూతన సవాళ్లు అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యాయమూర్తి డి.ఇందిర హాజరై మాట్లాడారు. సమాజంలో ప్రతి వ్యక్తికి గౌరవంతో జీవించే హక్కుతో పాటు సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం వంటి మౌలిక హక్కులు రాజ్యాంగం ద్వారా పరిరక్షించబడుతున్నాయని తెలిపారు. సైబర్ నేరాలు, ఆన్‌లైన్ వేధింపులు, ట్రాఫికింగ్, బాలల దుర్వినియోగం గృహహింస వంటి సమస్యలు అధికం అవుతున్నట్లు తెలిపారు. హక్కుల ఉల్లంఘనలు జరిగితే విద్యార్థులు ధైర్య ్డంగా ఫిర్యాదు చేయడంతో పాటు న్యాయ పోరాటం చేయాలన్నారు. విద్యార్థులు చట్టపరమైన జ్ఞానం పెంపొందించుకోవాలని సూచించారు.
క్వింటా ఆర్‌ఎన్‌ఆర్ రూ.2,839
జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు మంగళవారం వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 6 వేల క్వింటాళ్ల పంట దిగుబడులు విక్రయానికి వచ్చాయి. 5,700 క్వింటాళ్ల ధాన్యం రాగా.. ఆర్‌ఎన్‌ఆర్ క్వింటాలు గరిష్టంగా రూ.2,829, కనిష్టంగా రూ.1,674 ధరలు లభించాయి. హంస రకానికి గరిష్టంగా రూ.1,866, కనిష్టంగా రూ.1,625, చిట్టి ముత్యాలు రూ.3,016, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,972, కనిష్టంగా రూ.1,950 ధరలు పలికాయి. దేవరకద్ర మార్కెట్ యార్డులో ఆర్‌ఎన్‌ఆర్ క్వింటా గరిష్టంగా రూ.2,659, కనిష్టంగా రూ.2,309 ధర వచ్చింది. కాగా.. బుధవారం ఉదయం మార్కెట్‌లో ఉల్లిపాయల బహిరంగవేలం నిర్వహించనున్నారు.
బెల్ట్ షాపులపై దాడులు
బెల్ట్ షాపులపై దాడులు


