కలెక్టరేట్‌లో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మంగళవారం ఆవిష్కరించారు. హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి వర్చువల్‌గా ఆవిష్కరించగా జిల్లాలో జిల్లా పశు సంవర్ధక అధికారి మధుసూదన్‌గౌడ్, ఆర్‌అండ్‌బీ ఈఈ సంధ్య జిల్లా అధికారులు ఆవిష్కరించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో స్వరాష్ట్ర ఫలాలను ప్రజలకు అందించేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమాధికారి ఇందిర, సివిల్ సప్లయ్ అధికారి శ్రీనివాస్, టీఎన్‌జీఓ జిల్లాఅధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


