వందశాతం ఫలితాలు సాధించాలి: యెన్నం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: పదోతరగతి వార్షిక పరీక్షల్లో వంద శాతం ఫలితాలు సాధించాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. సోమవారం జిల్లాకేంద్రంలోని పోలీస్‌లైన్, ఎదిర, ఏనుగొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పదోతరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ కంటెంట్‌కు సంబంధించి ఎప్పుడైనా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చదువుకోగలిగేలా పాఠ్యాంశాలు, వీడియో పాఠాలు ప్రాక్టీస్ బిట్స్ వంటివి అందుబాటులోకి తెచ్చామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యావకాశాలు కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్‌ఖాద్రీ, మహబూబ్‌నగర్ ఫస్ట్ పర్యవేక్షకుడు గుండా మనోహర్, మాజీ కౌన్సిలర్లు తోకల యాదమ్మ, మహ్మద్ మోసిన్, రాషెద్‌ఖాన్, ఖాజాపాషా, నాయకులు పాల్గొన్నారు.


