ఒరిగిన చెన్నకేశవస్వామి ఆలయ ముఖద్వారం
జడ్చర్ల: మండలంలోని గంగాపూర్ లక్ష్మీచెన్నకేశవస్వామి దేవస్థానం ముఖద్వారం వరి ధాన్యం బస్తాలతో వెళ్తున్న ఓ లారీ అతివేగంగా ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం రాత్రి కోడ్గల్ గ్రామం వైపు నుంచి ముఖద్వారం కిందుగా 167నంబర్ జాతీయ రహదారిపైకి వస్తుండగా లారీలో వరి ధాన్యం బస్తాలు ఎత్తుగా ఓవర్‌లోడ్ ఉన్న కారణంగా ఎత్తు బస్తాలు ముఖద్వారాన్ని ఢీ కొనడంతో ఒక్కసారిగా ముఖద్వారం పునాధులు కదిలి ముందు వైపునకు ఒరిగిపోయింది. ముఖద్వారం ఏ క్షణమైనా నేలకూలే ప్రమాదం ఏర్పడింది. దీంతో ముఖద్వారం కిందుగా కోడ్గల్, తదితర గ్రామాలపైపు వెళ్లే రాకపోకలు నిలిచిపోయాయి.


