ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి
చిన్నచింతకుంట: వరిధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని డీపీఎం రామ్మూర్తి మండల మహిళా సమాఖ్య అధికారులకు సూచించారు. శనివారం మండల కేంద్రంలోని వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగోళ్ల రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరి ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని సూచించారు. ప్రస్తుతం వాతావరణ మార్పులతో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వర్షాలు కురిస్తే వరి ధాన్యం తడిసిపోతుందన్నారు. కొనుగోలు చివరి దశలో ఉందని కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేసి రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో మహిళా సమాఖ్య ఏపీఎం నాగమణి, సిబ్బంది తదితరులు ఉన్నారు.


