‘సాయి ఈశ్వర్‌చారిని బలితీసుకున్న కాంగ్రెస్’
మెట్టుగడ్డ: రిజర్వేషన్ల విషయంలో బీసీలకు అన్యాయం జరిగిందంటూ 42శాతం రిజర్వేషన్లు రాదేమోనన్న ఆందోళనలో ఆత్మ బలిదానం చేసుకున్న సాయి ఈశ్వర్‌చారి మృతికి కాంగ్రెస్ పార్టీయే ప్రధాన కారణమని స్వర్ణకారుల సంఘం పట్టణాధ్యక్షుడు రమేషాచారి ఆరోపించారు. ఆత్మబలిదానం చేసుకున్న సాయిఈశ్వర్ చారి మృతికి నిరసనగా జిల్లా కేంద్రంలో స్వర్ణకారులు దుకాణాలు స్వచ్ఛందంగా బంద్ చేశారు. దుకాణాలు బంద్ చేసి ర్యాలీగా క్లాక్‌టవర్ చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో చంద్రశేఖర్, శ్రీకాంత్ చారి, రేణుక చారి, రాజుచారి, నర్సింహాచారి, కిరణ్ చారి, సుధాకర్ చారి తదితరులు పాల్గొన్నారు.


