‘కాంగ్రెస్ మద్దతుదారుల గెలుపునకు కృషి చేయాలి’
జడ్చర్ల: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీచేస్తున్న అభ్యర్థులను గెలిపించుకోవాలని డీసీసీ అధ్యక్షుడు సంజీవ్‌ముదిరాజ్ పేర్కొన్నారు. శనివారం జడ్చర్లలో ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని, గ్రామాల్లో కాంగ్రెస్ మద్దతు అభ్యర్థుల తరఫున ప్రచారాలను ముమ్మరం చేయాలని సూచించారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్‌యాదవ్, మాజీ ఎంపీపీ నిత్యానందం, నాయకులు వెంకటేశం, మినాజ్, గోప్లాపూర్ యాదయ్య, ప్రవీన్, చందు, మదుసూదన్ తదితరులు పాల్గొన్నారు.


