4జీపీలు, 110వార్డులు ఏకగ్రీవం
● ముగిసిన రెండో విడత ఉపసంహరణ
● అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు
● నేటినుంచి ఊపందుకోనున్న ప్రచారం
పాలమూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సర్పంచ్, వార్డు మెంబర్ల నామినేషన్ల ఉపసంహరణ శనివారంతో ముగిసింది. కోయిలకొండ మండలంలో మొత్తం 55మంది సర్పంచ్ అభ్యర్థులు, 58వార్డు మెంబర్లు వారి నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. అదేవిధంగా మండలంలో 44గ్రామ పంచాయతీలు ఉండగా 4జీపీలు ఒకే నామినేషన్ రావడంతో ఏకగీవ్రమయ్యాయి. హనుమాన్‌గడ్డ తండా సర్పంచ్‌గా మాణిక్యమ్మ, పలుగుతండా సర్పంచ్‌గా సునీత, సంగనోనిపల్లి సర్పంచ్‌గా మేఘనాథ్, నక్కవానికుంట తండా సర్పంచ్‌గా అనసూయ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతోపాటు 110వార్డు మెంబర్లు ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. ఇక 270వార్డులకు 729మంది పోటీలో ఉండటం విశేషం. అదేవిధంగా 40సర్పంచ్ స్థానాలకు 135మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రెండో విడత ఈనెల 14న జరిగే ఎన్నికల కోసం పోటీలో ఉన్న అభ్యర్థులు గెలుపు కోసం అన్నిరకాల ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
27వార్డు సభ్యులు ఏకగ్రీవం
దేవరకద్ర: మండలంలో 18 గ్రామ పంచాయతీలకుగాను రెండు గ్రామాల్లో సర్పంచ్‌లు, 27 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు అధికారులు ప్రకటించారు. నార్లోనికుంట్ల సర్పంచ్‌గా లక్ష్మీదేవమ్మ, 8 వార్డులకు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బస్వాపూర్ సర్పంచ్‌గా నవనీత, 8 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకటించారు. మిగతా 16 జీపీలకుగాను 49మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాగే 141 వార్డులకుగాను 336 మంది పోటీలో ఉన్నారు.
నామినేషన్ల పరిశీలన
అడ్డాకుల: మూసాపేట, అడ్డాకుల మండలాల్లోని గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లను శనివారం అధికారులు పరిశీలన చేపట్టారు. అడ్డాకుల మండలంలో 17 జీపీలకు 119 సర్పంచ్ నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో పరిశీలనలో 29 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. వార్డు స్థానాలకు 396 నామినేషన్లు రాగా పరిశీలనలో 19 వార్డు నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. ఇదిలా ఉండగా మూసాపేటలో 15 పంచాయతీలకు 100 సర్పంచ్ నామినేషన్లు దాఖలు కాగా ఇందులో 31 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. ఇక వార్డులకు 363 నామినేషన్లు రాగా 13 నామినేషన్లను తిరస్కరించారు. ఉప సంహరణల గడువు ముగిస్తే బరిలో నిలిచే అభ్యర్థుల సంఖ్య తేలనుంది.
సర్పంచ్‌కు 73, వార్డులకు 427
మిడ్జిల్: మండలంలో ఈనెల 14న రెండో విడతలో జరుగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరణ గడువు శనివారంతో ముగిసింది. దీంతో 24 జీపీలకు సంబంధించి సర్పంచ్‌కు 73మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, 204 వార్డు స్థానాలకు 427మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు ఎంపీడీఓ గీతాంజలి తెలిపారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు శనివారం గుర్తులు కేటాయించినట్లు తెలిపారు.
ఊపందుకోనున్న ప్రచారం
చిన్నచింతకుంట: చిన్నచింతకుంట మండలంలో రెండో విడత సర్పంచుల ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థుల విడ్రాల పర్వం శనివారం ముగిసింది. దీంతో అధికారులు అభ్యర్థులకు గుర్తులను కేటాయించారు. చిన్నచింతకుంటలో 18 జీపీలకు సర్పంచులకు 96, 174వార్డు స్థానాలకు 484 నామినేషన్లు దాఖాలయ్యాయి. ప్రస్తుతం 59మంది సర్పంచు అభ్యర్థులు, 436 వార్డు సభ్యులు బరిలో ఉన్నారు. 37మంది సర్పంచు అభ్యర్థులు, 48 వార్డు సభ్యులు ఉపసంవరించుకున్నారు. 13 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. అందులో దమగ్నపురం 1, 4, గూడూరూ 6, సీతరాంపేట 2, 3, 6, 7, 8, పర్ధిపురం 5, 6, ఉంధ్యాల 8, 10 వార్డులు ఉన్నాయి. అభ్యర్థులకు గుర్తులు కేటాయించడంతో నేటినుంచి గ్రామాల్లో ప్రచారం ఊపందుకోనుంది.
సర్పంచ్ బరిలో 108, వార్డు మెంబర్లు 431
భూత్పూర్: మండలంలో మూడో విడత ఎన్నికలకుగాను శనివారం అధికారులు స్క్రూట్నీ చేపట్టారు. మండలంలో 19 జీపీలకుగానూ 108మంది సర్పంచులు, 174 వార్డు మెంబర్లకుగాను 431మంది బరిలో ఉన్నారు. అన్నాసాగర్ జీపీలో 8వ వార్డు మెంబర్‌గా భాగశ్రీ ఏకగ్రీవంగా నియమితులయ్యారు. శనివారం స్క్రూట్నీలో 8వ వార్డు మెంబర్‌గా భాగ్యశ్రీ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
బరిలో 170మంది సర్పంచ్ అభ్యర్థులు
రాజాపూర్: బాలానగర్ మండలంలోని 37 గ్రామ పంచాయతీలకు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో శనివారం స్క్రూట్నీ అనంతరం 170 మంది సర్పంచ్ అభ్యర్థులు 739 వార్డు సభ్యులు పోటీలో నిలువనున్నారు. దీంతో ఇప్పటికే కొన్ని గ్రామాల్లో అభ్యర్థులను బుజ్జగించి పోటీలో నుంచి తప్పించి ఏకగ్రీవం చేసుకునే ప్రయత్నంలో అభ్యర్థులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఏకగ్రీవం చేస్తే గ్రామ పంచాయతీలకు సొంతంగా డబ్బులు ముందుగానే గ్రామపంచాతీ అకౌంట్‌లో వేస్తామని కొన్ని గ్రామాల్లో సర్పంచ్ బరిలో ఉన్న అభ్యర్థులు బుజ్జగింపులు మొదలుపెట్టారు.
లక్ష్మీదేవమ్మ,
నార్లోనికుంట్ల
నవనీత,
బస్వాపూర్
4జీపీలు, 110వార్డులు ఏకగ్రీవం
4జీపీలు, 110వార్డులు ఏకగ్రీవం
4జీపీలు, 110వార్డులు ఏకగ్రీవం


