మెరుగైన వైద్యం అందించాలి
మిడ్జిల్: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా వైద్యాధికారి డాక్టర్ కృష్ణ సందర్శించారు. ఆస్పత్రిలో రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రిలో ప్రసవాలను పెంచాలని, ప్రజలకు మెరుగైన వైద్యసేవలను అందించాలని సూచించారు. క్రమం తప్పకుండా సిబ్బంది ఎప్పుడు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. ఆయన వెంట వైద్యాధికారి కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు.
కార్మికులకు స్వెట్టర్లు పంపిణీ
స్టేషన్ మహబూబ్‌నగర్: వివేకానంద విద్యానికేతన్ రిటైర్డ్ టీచర్స్, పూర్వ విద్యార్థుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో మున్సిపల్ కార్మికులకు స్వెట్టర్లు పంపిణీ చేశారు. మున్సిపల్ కార్మికుల శ్రమను గౌరవిస్తూ మున్సిపల్ కార్యాలయం, అశోక్ టాకీస్ చౌరస్తా, వన్ టౌన్ చౌరస్తా, శ్రీనివాసకాలనీ, బీకేరెడ్డికాలనీ, భగీరథ కాలనీ, రాజేంద్రనగర్‌తోపాటు పట్టణంలోని పలుచోట్ల దాదాపు 500మందికి వెచ్చని టోపీలు, మఫ్లర్లు అందజేసినట్లు ప్రతినిధులు తెలిపారు. సమాజంలో నిస్వార్థంగా సేవ చేస్తున్న పారిశుధ్య కార్మికులు చలికాలంలో ఇబ్బంది కలగకుండా వారికి కొంత ఉపశమనం అందించాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.
భక్తిశ్రద్ధలతోఅయ్యప్ప పడిపూజ
గండేడ్: మండలంలోని వెన్నాచేడ్‌లో అయ్యప్ప మహాపడిపూజ కార్యక్రమం శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామానికి చెందిన బోయిని గోపాల్, గురుస్వాములు శ్రీనివాస్, రాజశేఖర్‌గౌడ్ ఆధ్వర్యంలో మహాపడిపూజ నిర్వహించగా.. అయ్యప్ప నామస్మరణతో గ్రామమంతా మారుమోగింది. హన్వాడ, మహమ్మదాబాద్, కోస్గి, గండేడ్ మండలాల నుంచి అయ్యప్ప భక్తులు తరలివచ్చారు. పూజా కార్యక్రమానికి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలతోపాటు అన్నదానం బిక్ష ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో గురుస్వాములు చెన్నయ్య, రవి, లక్ష్మీకాంత్‌రెడ్డి, బాల్‌రాజ్, గోవర్దన్, పాండు, పెంట్యానాయక్, మారుతి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
టీయూడబ్ల్యూజే
జిల్లా కార్యవర్గం ఎన్నిక
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా కార్యవర్గాన్ని యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మధుగౌడ్ శనివారం జి ల్లా కేంద్రంలోని సురవరం ప్రతాపరెడ్డి ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో ప్రకటించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాసభను కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం చేసినందుకు శుభాకాంక్షలు తెలిపారు.
అధ్యక్షుడిగా నాగరాజుగౌడ్
టీయూడబ్ల్యూజే (ఐజేయూ) మహబూబ్‌నగర్ జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎనున్నకున్నారు. అధ్యక్షుడిగా నాగరాజుగౌడ్, జిల్లా కార్యదర్శిగా సతీశ్‌కుమార్ రెడ్డి, కోశాధికారిగా రఘు, ఉపాధ్యక్షులుగా పవన్‌కుమార్‌రెడ్డి, భాస్కర్‌రావు, శేఖర్, మెహరాజ్, సంయుక్త కార్యదర్శులుగా రవీందర్‌గౌడ్, జాఫర్, ప్రభాకర్, వెంకటేశ్, కార్యవర్గ సభ్యులుగా మాణిక్‌రావు, ప్రశాంత్, వేణుగోపాలచారి, వెంకటయ్యతోపాటు తదితరులు ఎన్నికయ్యారు.
మెరుగైన వైద్యం అందించాలి
మెరుగైన వైద్యం అందించాలి


