అంబేడ్కర్‌కు ఘననివాళి
అంబేడ్కర్ వర్ధంతిని శనివారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో విగ్రహానికి, కాంగ్రెస్ కార్యాలయంలో చిత్రపటానికి ఎమ్మెల్యేతోపాటు డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, టీజీఎంఎఫ్‌సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ పూలమాల వేసి నివాళులర్పించారు. సిగ్నల్‌గడ్డ చౌరస్తాలో అంబేడ్కర్ చిత్రపటానికి మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లాకేంద్రంలో రాజకీయ నాయకులు, మాలల చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు కేశవులు, తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహయ్య, అంబేద్కర్ కళాభవన్ పరిరక్షణ సమితి ఉమ్మడి జిల్లా కమిటీ, టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బాలరాజు, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు మోహన్, మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదయ్య ఆధ్వర్యంలో అంబేడ్కర్ చౌరస్తాలో కాంస్య విగ్రహానికి, పాతపాలమూరులోని జై భీమ్ చౌరస్తాలో విగ్రహానికి కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఆదివిష్ణువర్ధన్ ఆధ్వర్యంలో, ఏను గొండలో విగ్రహానికి ఎమ్మార్పీఎస్ దక్షిణ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మల్లెపోగు శ్రీనివాస్, బార్ అసోసియేషన్ భవ న్‌లో అధ్యక్షుడు అనంతరెడ్డి అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
– నెట్‌వర్క్, సాక్షి
కాంగ్రెస్ కార్యాలయంలో నివాళులర్పిస్తున్న
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్
సిగ్నల్ గడ్డ చౌరస్తాలో నివాళులర్పిస్తున్న మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
అంబేడ్కర్‌కు ఘననివాళి
అంబేడ్కర్‌కు ఘననివాళి


