సమస్యాత్మక గ్రామాలపై నిఘా
నవాబుపేట: సమస్యాత్మక గ్రామాలపై నిఘా పెంచి పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా చూస్తామని అడిషనల్ ఎస్‌పీ రత్నం అన్నారు. శనివారం ఆయన మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టిపెట్టినట్లు వివరించారు. కారుకొండ, ఇప్పటూర్, యన్మన్‌గండ్ల సమ స్యాత్మకంగా ఉన్నయాని, వాటికి ప్రత్యేక సిబ్బందితోపాటు తగు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఎన్నికల నిబంధలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
రాజాపూర్: ప్రతిఓటరు తమ ఓటుహక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని డీఎస్పీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. శనివారం మండలంలోని చొక్కంపేట్‌లో ఎన్నికల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు డబ్బు, మద్యం ఉచితాల బహుమతులనే ప్రలోభాలకు లొంగకుండా నిష్పక్షపాతంగా ఓటుహక్కును వినియోగించుకోవాలన్నారు. అనంతరం మండల కేంద్రంలో పోలీసులు ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. జడ్చర్ల రూరల్‌సీఐ నాగార్జునగౌడ్, ఎస్‌ఐ శివానందంగౌడ్ పోలీసులు పాల్గొన్నారు.
భూత్పూర్: గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు పండుగలా శాంతియుతంగా నిర్వహించుకోవాలని ఎస్‌ఐ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని ఎల్కిచర్లలో గ్రామపంచాయతీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అవగాహన ప్రచార కార్యక్రమంలో భాగంగా సురక్ష పోలీసు కళాబృందం, మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం, షీటీంలు, పోలీసు అధికారుల ఽఆధ్వర్యంలో గ్రామస్తులకు అవగాహన కల్పించారు.
సమస్యాత్మక గ్రామాలపై నిఘా


