అవినీతి నిరోధక శాఖ అవగాహన ర్యాలీ
మహబూబ్‌నగర్ క్రైం: ప్రభుత్వ శాఖలలో ఎవరూ కూడా డబ్బులు ఇచ్చి పనులు చేసుకోవడం చేయరాదని, ఎవరైనా అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తే ఏసీబీకి ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ అన్నారు. అవినీతి నిరోధక శాఖ వారోత్సవాల్లో భాగంగా శనివారం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. బాధితులు 1064 టోల్‌ఫ్రీతో పాటు 9440446106 వాట్సాప్‌లో ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉందన్నారు. దీంతోపాటు ఇతర సోషల్ మీడియా, క్యూ ఆర్‌కోడ్ నుంచి ఏసీబీ అధికారుల సమాచారం ఇవ్వడానికి ప్రస్తుతం అవకాశం ఉందని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ఉండే ప్రతిఒక్కరూ సరైన పద్ధతిలో ప్రభుత్వ కార్యాలయాల నుంచి పనులు చేసుకోవడానికి చైతన్యం కావాలన్నారు. కార్యక్రమంలో ఏసీబీ సీఐ లింగస్వామి, ప్రిన్సిపాల్ భగవంతచారి పాల్గొన్నారు.


