బీజేపీ, బీఆర్‌ఎస్ పొత్తు!
చిన్నచింతకుంట: మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకొని పలు గ్రామాల్లో బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి పనిచేయనున్నాయి. అందుకు పలు గ్రామాల్లో పొత్తులు ఏర్పర్చుకున్నారు. చిన్నచింతకుంట, పర్ధిపురం గ్రామాల్లో బీజేపీ మద్దతు సర్పంచు అభ్యర్థులు అలాగే దమగ్నపురం, ఏదులాపురంలో బీజేపీ సర్పంచు అభ్యర్థులు శనివారం నామినేషన్లు విరమించుకున్నారు. చిన్నవడ్డెమాన్‌లో బీజేపీ నుంచి నామినేషన్ దాఖలు చేయలేదు. చిన్నచింతకుంట, పర్ధిపురం, బీజేపీ పార్టీకి సర్పంచు పదవి, బీఆర్‌ఎస్‌కు ఉపసర్పంచులు అలాగే దమగ్నపురం, చిన్నవడ్డేమాన్, ఏదులాపురంలో బీఆర్‌ఎస్‌కు సర్పంచు పదవి, బీజేపీకి ఉపసర్పంచ్ పదవులతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
పీయూలో స్కూల్ ట్రాన్స్‌ఫర్మేషన్
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూలో భూమి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సైన్స్ టెక్నాలజీ, ఇంజినీరింగ్ మ్యాథ్స్ స్కూల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు కార్యక్రమంలో వీసీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి వారిని జీవితంలో ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేశ్, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న
మాక్ పోలింగ్
నవాబుపేట: పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత పోలింగ్ ఈనెల 11న జరగనుంది. కాని ఇక్కడ మాత్రం ప్రశాంతంగా ముగిసిందంటున్నారు. అని ఆశ్చర్యపోతున్నారా.. అవును ఇది నిజంగా పోలింగ్ కాదు.. కాని అచ్చం అదే తరహాలో చిన్నారులు పంచాయతీ పోరును కళ్లకు కట్టినట్టు పోలింగ్ తీరును మాక్ పోలింగ్ రూపంలో చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. శనివారం మండల కేంద్రంలో సిద్ధార్థ ప్రైవేట్ పాఠశాలలో మాక్‌పోలింగ్ నిర్వహించి విద్యార్థులకు పంచాయతీ పోరుపై అవగాహన కల్పించారు.


