అదుపుతప్పిన ట్రావెల్స్ బస్సు
మానవపాడు: జాతీయ రహదారి– 44పై ట్రావెల్స్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న రక్షణ ఢీకొట్టిన ఘటన మండల కేంద్ర శివారు ప్రాంతంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న మాధవి ట్రావెల్స్ ప్రైవేటు బస్సు మానవపాడు స్టేజి సమీపంలో ముందు వవెళ్తున్న కారు సడెన్ బ్రెక్ వేయడంతో అదుపు తప్పి రహదారి పక్కనున్న రక్షణ గోడను ఢీకొట్టి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టింది ఆగింది. ప్రమాద సమయంలో డోర్ పూర్తిగా లాక్ అవ్వడంతో ప్రయాణికులు భయందోళనకు లోనయ్యారు. ఎమర్జెన్సీ తలుపు ద్వారా సురక్షితంగా బయటకు వచ్చారు. ప్రమాద సమయంలో బస్సులో 27 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని డ్రైవర్ ప్రసాద్, క్లీనర్ దేవదానం తెలిపారు.
27 మంది సురక్షితం


