కోనేరులో పడి వృద్ధురాలి మృతి
జడ్చర్ల: స్థానిక శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద గల కోనేరులో పడి వృద్ధురాలు మృతి చెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. సీఐ కమలాకర్ కథనం మేరకు.. స్థానిక వెంకటేశ్వర కాలనీకి చెందిన నాసు సాయమ్మ(60) మంగళవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. చుట్టు పక్కల గాలించినా ఫలితం లేకపోయింది. బుధవారం కోనేరులో మృతదేహం తేలడంతో బయటకు తీసి గుర్తించారు. కోనేరులో ప్రమాదవశాత్తు జారిపడి ఉంటుందన్న మృతురాలి కుమారుడు రవికుమార్ కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.
ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం.. మహిళ మృతి
జడ్చర్ల: ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా పత్తి తీసేందుకు వెళ్లిన మహిళా కూలి మరణించారు. హన్వాడ మండలం టంకర గ్రామానికి చెందిన నాగమణి (30) ఆటోలో జడ్చర్ల మండలంలోని నసుల్లాబాద్ గ్రామ శివారులో మంగళవారం పత్తి తీసేందుకు వెళ్లారు. పనులు ముగించుకొని ఆటోలో ఇంటికి వస్తుండగా ఆటో డ్రైవర్ నరేష్ సామర్థ్యానికి మించి కూలిలను ఎక్కించుకోవడంతో పాటు వాహనాన్ని నిర్లక్ష్యంగా నడుపుతూ ఎదురుగా వస్తున్న ఆ టో, బైక్‌ను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ఆటో బోల్తా పడగా నాగమణికి తీవ్రగాయాలయ్యా యి. వెంటనే జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని డాక్టర్లు తెలిపారు. మృతురాలి తల్లి గోపమ్మ ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్‌పై బుధవారం కేసు నమోదు చేసినట్లు సీఐ కమలాకర్ తెలిపారు.
అనుమానాస్పదంగా ఇద్దరి మృతి
చిన్నచింతకుంట: అనుమా నాస్పదంగా ఇద్దరు వ్యక్తు లు మృతి చెందిన ఘటన చిన్నచింతకుంట అమ్మపు రం గ్రామ సమీపంలోని కురుమూర్తి జాతరలో చో టు చేసుకుంది. ఎస్‌ఐ ఓ బుల్‌రెడ్డి తెలిపిన వివరా లు.. నర్వ మండలం చిన్నకడుమూర్‌కు చెందిన మల్లేష్( 30) జాతరలో కాగితాలు,ఇనుప సామా న్లు వేరుకుంటు తిరుగుతుండేవాడు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్ జిల్లా డోన్ మండలానికి చెందిన బాషా(45) జాతరలో అడుక్కుండేవాడు. బుధ వారం వారిరువురు అనుమానాస్పదంగా గ్రా మ సమీపంలో మృతిచెంది పడి ఉన్నారు. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల ఆచూకీ తెలిసిన వారు 87126 59316, 87126 59354 నంబర్లను సంప్రదించవలసిందిగా ఎస్‌ఐ పేర్కొన్నారు.
చికిత్స పొందుతూ యువకుడి మృతి
చిన్నచింతకుంట: పురుగు మందు తాగి ఆస్పత్రిలో చికి త్స పొందుతున్న యు వకు డు మృతి చెందిన సంఘట న మండలంలోని పర్ధిపురంలో జరిగింది. ఎస్‌ఐ ఓబుల్‌రెడ్డి తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన వడ్ల బాలకృష్ణ(17) ప్రేమ విఫలమైన కారణంగా గత నెల 19న పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. మృతదేహాన్ని గ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.
కారును తప్పించబోయి ఒరిగిన ఆర్టీసీ బస్సు
దోమలపెంట: అమ్రాబాద్ మండల పరిధిలోని శ్రీశైలం ప్రధాన రహదారిలో బుధవారం ఓ ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి రోడ్డు పక్కకు ఒరిగింది. వివరాల్లోకి వెళ్తే.. శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సు అక్కమహాదేవి రోడ్డు మలుపు వద్దకు రాగానే అతివేగంగా వస్తున్న కారును తప్పించబోయి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. దీంతో బస్సు టైర్లు బురదలో ఇరుక్కుపోయాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలసుకున్న ఈగలపెంట ఎస్‌ఐ జయన్న వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికుల సాయంతోనే బురదలో ఇరుక్కుపోయిన బస్సును రోడ్డుపైకి తెచ్చారు. ప్రయాణికుల సంక్షేమార్థం అలాగే అడవిలో జంతువులు ప్రమాదాలకు గురికాకుండా అటవీశాఖ వారు నల్లమలలోని శ్రీశైలం ప్రధాన రహదారిలో స్పీడ్ గన్‌లను ఏర్పాటు చేస్తే వేగంగా ప్రయాణించే వాహనాలకు బ్రేక్ పడుతుందని ప్రయాణికులు చెబతున్నారు.
కోనేరులో పడి వృద్ధురాలి మృతి
కోనేరులో పడి వృద్ధురాలి మృతి


