కురుమూర్తి క్షేత్రం.. జనసంద్రం
జాతర మైదానంలో భక్తుల రద్దీ
చిన్నచింతకుంట: కురుమూర్తిస్వామి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం కార్తీక పౌర్ణమి కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఉదయం నుంచే స్వామివారి దర్శనానికి క్యూ కట్టారు. ఆలయ రాజగోపురం, స్వామివారి ప్రధానాలయం, జమ్మిచెట్టు, అమ్మవారి ఆలయం తదితర ప్రాంతాల్లో కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అదే విధంగా చెన్నకేశవస్వామి, ఆంజనేయస్వామి, ఉద్దాల మండపాలను దర్శించుకున్నారు. భక్తులు దీపాలు వెలిగించేందుకు ఆలయ సిబ్బంది అన్ని వసతులు కల్పించారు. జాతర మైదానంలో భక్తులతో కిటకిటలాడింది. కురుమూర్తి కొండలు గోవింద నామస్మరణతో మార్మోగాయి.
కురుమూర్తి క్షేత్రం.. జనసంద్రం
కురుమూర్తి క్షేత్రం.. జనసంద్రం


